Link copied!
Sign in / Sign up
2
Shares

యోని లేకుండా జన్మించిన అమ్మాయి ఇప్పుడు తల్లి కాబోతోంది : ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

యోని లేకుండా జన్మించిన అమ్మాయి, ఇప్పుడు తల్లి కాబోతోంది. ఎలాగో అని అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది కదూ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అందరి మహిళలలాగా ఉండాల్సిన యోని భాగం ఆమె శరీరంలో లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. అసలేం జరిగిందో మీరే చూడండి.

పుట్టుకతోనే యోని లేకుండా..

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు దేవన్ మెర్క్, జార్జియాకు చెందిన ఈమె పుట్టుకతోనే యోని లేకుండా జన్మించారు. అయితే యూరిన్ బయటకు వచ్చేందుకు మాత్రం చిన్న రంధ్రం ఉండేదట. ఇలా జన్మించడం వలన పునరుత్పత్తి జరగదని, యోని రంధ్రం, గర్భాశయం లేదని అన్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సమస్య నుండి బయటపడటానికి ఆమె తల్లి తన కూతుర్ని తీసుకుని ఎంతోమంది డాక్టర్స్ ను కలవగా 12 ఏళ్ళ వయస్సు నుండి దీనికి సంబంధించి సర్జరీ మొదలుపెట్టగా 16 ఏట డాక్టర్స్ నిర్మించిన యోని విజయవంతంగా శస్త్రచికిత్స సఫలమైంది.  ఐతే 12 ఏళ్ళ వయస్సుప్పుడు కడుపులో మంటగా ఉండేదని, ప్రతి నెల కొద్దిమొత్తంలో కొంచెం రక్తం బయటకు పోతూ ఉండేదని బాధపడేదట.

తల్లి కాబోతోంది..

చిన్నతనంలో దేవన్ మెర్క్ సమస్య తెలిసిన తన తోటి క్లాస్ మేట్స్, ఫ్రెండ్స్ ఏడిపించేవాళ్ళట. ఇది ఎంతగానో బాధగా ఉండేదట. ఇలా 5000 మంది మహిళలలో ఏ ఒక్కరికో వచ్చే రేర్ కండీషన్ అని డాక్టర్స్ తెలిపారు. దేవన్ పరిస్థితి అర్థం చేసుకున్న ట్రెంట్ అనే ఆమె స్నేహితుడు ఆమెను ప్రేమించాడు. అతడు దగ్గర కావడంతో తన బాధను మరిచిపోయింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో వీళ్ళు ఒక్కటి కావడంతో సరోగసీ పధ్ధతి ద్వారా బిడ్డకు జన్మను ఇవ్వాలని అనుకుంటారు. అందుకు దేవన్ మెర్క్ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మ అవ్వడం మహిళలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం కదా.

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తల్లి కావడానికి సిద్ధమైన ఈమెకు మీ తరపున అభినందనలు మరియు ఆల్ ది బెస్ట్ చెప్పండి.   

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon