Link copied!
Sign in / Sign up
1
Shares

యోనికి సంబంధించిన ఈ 5 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు : కానీ మేం మీకు చెబుతున్నాం..


మహిళల శరీరంలో యోని ఒక ఆసక్తికరమైన అవయువం. కానీ మీ యోని గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? మీరు యోని గురించి  తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన, తమాషా అయినా, విచిత్రమైన విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైన, ఆసక్తి కరమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి…

1. శుభ్రపరుచుకుంటుంది

మీ యోనిని నీటితో లేదా సోపుతో శుభ్రపరుచుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీ యోని తనను తానే శుభ్రపరుచుకుంటుంది. దానినే డిశ్చార్జ్ అంటారు. అది మీ పీరియడ్ ముందు కానీ లేదా తర్వాత కానీ వస్తుంది. సహజంగా డిశ్చార్జ్ తెల్లగా, చిక్కగా, జిగటగా వాసన లేకుండా ఉంటుంది. ఒకవేళ డిశ్చార్జ్ పచ్చగా వస్తే దానికి కారణం ఇన్ఫెక్షన్ అయ్యుండవచ్చు. ఇలా జరిగితే వెంటనే డాక్టర్ ను కలవండి.

2. వాసన

మహిళలందరిలో యోని వాసన ఒకేలా ఉండదు. అది మీ యోని సమస్య కాదు. మీ యోని వాసనకు కారణాలు అనేకం ఉండవచ్చు. తీసుకునే ఆహారం లేదా ఎక్కువ చమట పోయడం కారణం కావచ్చు. అందుకే యోని భిన్నమైన వాసన రావచ్చు.

3. గాలి

కొన్ని సార్లు మీ యోని చాలా తాజాగా వాసన వస్తుంది. కానీ కొన్ని సార్లు దుర్వాసన వస్తుంది. ఇందుకు కారణం మీరు రోజు బిగుతైన అండర్ వేర్ వేసుకోవడం కావచ్చు. అప్పుడప్పుడు అండర్ వేర్ వేసుకోకపోవడం మంచిది. యోనికి గాలి తగలడం వలన తాజాగా ఉంటుంది.

4. గ్యాస్

మహిళల శరీరంలో యోని కూడా గ్యాస్ విడుదల చేస్తుంది. యోని ద్వారా లోపలికి వెళ్ళిన గాలి మళ్ళి బయటకు వస్తుంది. దీనిని ఖ్వీఫింగ్ (Queefing) అంటారు. ఇది ఏ విధమైన వాసన రాదూ.

5. స్తంభన

పురుషుల అంగం స్తంభించినట్టు స్త్రీల యోని కూడా స్తంభిస్తుంది. అయితే ఆ స్తంభన గమనించేంతగా ఉండదు. కాని కోరికలు కలిగినప్పుడు స్త్రీల యోని 200% స్తంభిస్తుంది.

6. క్లిటోరిస్

మహిళల యోనిలో క్లిటోరిస్ ఒక ప్రత్యేకమైన భాగం. ఇది కేవలం భావప్రాప్తి కలిగించడానికి మాత్రమే నిర్మాణమయి ఉంటుంది.  క్లిటోరిస్ కు సుమారుగా 8000 నాడులు ఉంటాయి. దీని కారణంగా ఇది చాలా సున్నితంగా ఉంటుంది. భావప్రాప్తిని కలిగిస్తుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon