Link copied!
Sign in / Sign up
56
Shares

యోని గురించి అందరికి తెలియని 5 రహస్యాలు


ఎవరి యోనిని వారు ఇష్టపడుతారు. దాంట్లో తప్పు ఏమి లేదు. ప్రతి మహిళ యోని, ఎవరికీ వారివి భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సృష్టి ముందుకు నడవడానికి, యోని కావాలి. దానిని కలిగిన ఆడవాళ్ళు కావాలి. అందుకే ఆడవారిని ఈ జగత్తును నడిపించే శక్తి రూపంగా పూజిస్తారు. దానికి కారణం యోని. అలాంటి యోని గురించి, మహిళలకు కూడా పూర్తిగా తెలీదు. అలాగే అసలు తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి… అవి మీకోసం…

1. యోని శీర్షం (క్లిటోరిస్)

యోనిలో అత్యంత ముఖ్యమైన భాగం, క్లిటోరిస్ (యోని శీర్షం). సెక్స్ చేసేటప్పుడు మీకు భావప్రాప్తి కలగడానికి ఇదే కారణం. ఇందులో 8000 నరాలు ఉంటాయి. ఇది అత్యంత సున్నితంగా ఉంటుంది. దీని మీద జరిగే రాపిడి వలనే మీకు భావప్రాప్తి కలుగుతుంది.

2. కన్నెపొర

మన అందరికి తెలిసినవిధంగా, కన్నెపొరకు వర్జినిటీకి ఏ విధమైన సంబంధం లేదు. కన్నె పోర చినిగిపోవడం వలన కన్నెత్వం పోయినట్టు కాదు. కేవలం సెక్స్ లో పాల్గొన్నప్పుడు మాత్రమే కాదు, ఏదైనా అత్తలు ఆడినప్పుడు, సైకిల్ తొక్కుతూ కిందపడినప్పుడు... ఇవి జరిగినప్పుడు కూడా కన్నెపొర చినిగిపోతుంది.

3. భావప్రాప్తి

అందరు అనుకునేటట్టు కేవలం యోని వలన మాత్రమే భావప్రాప్తి కలగదు. కేవలం 25%-35% మంది మహిళలు మాత్రమే యోని ద్వారా భావప్రాప్తిని పొందుతారు. యోనిలో కదలికలు మాత్రమే కాకుండా, శరీరంలోని వివిధ భాగాలలో స్పర్శ ద్వారా కూడా భావప్రాప్తిని పొందచ్చు.

4. లూబ్రికేషన్

సెక్స్ లో పొల్గొనేటప్పుడు, అంగం సులువుగా లోపలి వెళ్ళడానికి అవసరమైన లూబ్రికేషన్ను యోని అందిస్తుంది. యోని చుట్టూ ఉండే ప్రోస్టేట్ గ్లాండ్స్, లూబ్రికేషన్ ను అందిస్తాయి. ఈ ప్రోసెస్ ను ట్రాన్సుడేషన్ అంటారు.

5. ప్రసవం తరువాత

ప్రసవం తరువాత యోనిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. గర్భాశయ ద్వారం కొంచెం పెద్దవుతుంది. మీరు అనుభవించే సెక్స్ లో మార్పు ఉండదు. 

ఇవి కూడా చదవండి

వెజైనా (యోని) బిగువుగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon