Link copied!
Sign in / Sign up
0
Shares

ఉమెన్స్ డే స్పెషల్ : కుటుంబంతో పాటు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న శక్తివంతమైన మహిళలు


ముందుగా ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మ. ఆ తర్వాత అక్క, పిన్ని, వదిన,కూతురు, భార్య, అత్త, నానమ్మ, అమ్మమ్మ..ఇలా మనందరి జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. ఒకప్పుడు ఆడవాళ్లు అంటే వంటిల్లు లేదా ఇంటికి పరిమితం అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్క రంగంలోనూ ముందుండాలని మహిళలను గౌరవిస్తూ వారికి సపోర్ట్ ఇస్తున్నారు. అలా మన టాలీవుడ్ కు చెందిన మహిళలు ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే, సమాజం పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారో చూడండి.

నమ్రత మహేష్

మహేష్ బాబు భార్యగా, తన ఇద్దరు పిల్లలు మరియు కుటుంబాన్ని బాగా చూసుకుంటూ మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలను, అక్కడి పనులను, అలాగే మహేష్ బాబు చిన్న పిల్లల కోసం తన సంపాదనలో కొంత భాగాన్ని వారి ఆరోగ్యం కోసం ఉపయోగించడంలో ముందుండి నడిపిస్తున్నారు.

సమంత

హీరోయిన్ గా ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు అక్కినేని కుటుంబం కోడలిగా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నారు. అలాగే ప్రత్యూష సపోర్ట్ అనే ఆర్గనైజేషన్ ద్వారా సరైన వైద్యం అందలేని పిల్లలకు తన చేతనైన సాయం చేస్తూ, ఈ మంచి పనిలో ఇతరుల సహాయం తీసుకుంటున్నారు.

అమల

నాగార్జున భార్యగా అందరికీ సుపరిచితురాలైన అమల గారు చాలా మంచి మనస్సున్న గొప్ప మనిషి. మూగ జీవులకు ఏమైనా ఐతే అస్సలు తట్టుకోలేరు. మూగ జీవాలను కాపాడే బాధ్యతగా అనిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నారు.

రమా రాజమౌళి

రాజమౌళి అంటే బహుశా ప్రస్తుతం ఎవ్వరూ తెలియని వారు ఉండకపోవచ్చు. అలాగే ఆయన భార్య రమా గారు కూడా ఒకవైపు తన పిల్లల చదువును, కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ బాహుబలి వంటి భారీ బడ్జెట్ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి మంచి పేరు పొందారు. మహిళలు దేనిలోనూ తక్కువ కాదు అని చెప్పడానికి రమా గారే నిదర్శనం.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి… మోహన్ బాబు నట వారసురాలిగా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మంచి మనసున్న గొప్ప వ్యక్తి అని ఆమె రీసెంట్ గా చేస్తున్న కార్యక్రమాల వల్ల అందరికీ తెలిసే ఉంటుంది. కుటుంబ సమస్యలు, పేదరికం, అనారోగ్యం బారిన పడిన వారు, టాలెంట్ ఉన్నా కూడా కుటుంబ పరిస్థితుల వలన ఇబ్బంది పడుతున్నవారిని మేముసైతం అనే కార్యక్రమం ద్వారా ఇతర నటీనటుల సాయంతో అండగా నిలబడ్డారు.

ఉపాసన

చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్యగా అందరికీ తెలిసిన మరో శక్తివంతమైన మహిళ ఉపాసన. రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ లో ఒక ముఖ్యమైన సభ్యురాలిగా పేదరికంలో ఉన్నవారికి సరైన సమయంలో మంచి వైద్యాన్ని అందిస్తూ గొప్ప సహాయం చేస్తున్నారు.

గౌతమి

బ్రెస్ట్ క్యాన్సర్.. మహిళలను ప్రస్తుతం బాధిస్తున్న అతి పెద్ద సమస్య. ఈ సమస్య బారిన పడిన నటి గౌతమి గారు. తనలా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అనే మంచి ఉద్దేశ్యంతో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అందరికీ తెలిసేలా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

శక్తివంతమైన మహిళలు కుటుంబాన్ని చూసుకుంటూ, సమాజనానికి చేతనైన సాయం చేస్తున్న ఇలాంటి మహిళలందరినీ గౌరవిద్దాం.. #HappyWomensDay..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon