Link copied!
Sign in / Sign up
2
Shares

మహిళలు ఎప్పటికీ చేయకూడని 5 తప్పులు : ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు

మీకు ఎవరైనా చెప్పారో లేదో గానీ మన పూర్వీకులు, పెద్దలు కొన్ని విషయాలను తప్పకుండా ఫాలో అయ్యేవారు. ఇలా చేయడం తమని తాము గౌరవించుకున్నట్లుగానే కాకుండా ఈ ప్రకృతికి ఇచ్చిన గౌరవంగా ఫీలయ్యేవారు. అయితే మహిళలు, గృహిణిలు కొన్ని కొన్ని నియమాలను ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఫాలో అవ్వాలని చెబుతున్నారు మన పెద్దలు. ఆ నియమాలేంటో మీరూ తెలుసుకోండి. ఈ నియమాలు పాటించకపోతే ఇంట్లో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు.

మహిళలు ఉదయాన్నే చేయకూడని పనులు :

మహిళలే ఈ పనులు ఉదయం చేయకూడదా అని అనుకోకండి. ఇక్కడ చెప్పుకునే కొన్ని విషయాలు మగవారికి కూడా వర్తిస్తాయి. అవేంటో ఇక్కడ చూసేద్దాం..

◼️ మహిళలు ఉదయాన్నే జుట్టు విరబూసుకుని ఇంట్లో అటూఇటూ తిరగడం చేయకూడదు.

◼️ ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి.

◼️ ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు.

◼️ ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు.

◼️ మీకు భయం కలిగించే ఫొటోలు, భయాన్ని కలిగించే జంతువుల ఫోటోలు చూడకూడదు.

ఉదయాన్నే నిద్రలేచాక చేయాల్సిన పనులు :

ఉదయం నిద్రలేచిన వెంటనే ఏం చేయకూడదో చెప్పారు, మరి నిద్రలేచిన వెంటనే ఏం చేయాలో కూడా చెప్పండి అని మీరు అడగకముందే  వివరంగా మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో తెలుసుకోండి.

◼️ ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి.

◼️ మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది.

◼️ ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని, మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు.

◼️ ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి. పసి పిల్లలు హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి.

◼️ పెళ్లి చేసుకున్నవారు మాత్రం ఇల్లాలు ముఖం  మొదటిగా చూడామని చెబుతున్నారు.

పైన చెప్పుకున్న విధంగా ఇంటికి ఇబ్బందిని కలిగించే ఆ పనులు చేయకూడదు మరియు మీకు శుభాన్ని కలిగించే ఈ పనులను తప్పక చేయాలి. ఇలా చేయాలా వద్దా అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మీ ఇష్టం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon