Link copied!
Sign in / Sign up
1
Shares

దోశ పిండి ఆడిస్తుండగా మెషిన్ లో ఇరుక్కుపోయిన చీర : తలకు గాయాలు, మహిళలు తప్పక తెలుసుకోండి..

మన ఇళ్లలో ప్రతి ఒక్కరూ దోశపిండి, ఇడ్లీపిండి రుబ్బడానికి పెద్ద పెద్ద రోలు వంటివి ఉపయోగిస్తుంటారు. ఆ సమయంలో సరిగ్గా చూసుకోకపోవడం వలన తమ దుస్తులు, చేతులు అందులో పడిపోయి ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు చాలానే చూసి ఉన్నాం. ఇక్కడ అలాంటి బాధాకరమైన సంఘటనే చోటు చేసుకుంది.

రోలులో ఇరుక్కపోయిన దుప్పటా

సుప్ర్రియా ప్రధాన్, పూణేలోని గోఖలే నగర్ లో మెస్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. 40 ఏళ్ళ సుప్రియా ప్రధాన్ సోమవారం సాయంత్రం దోశపిండి మెషిన్ లో పిండి వేసి రుబ్బుతుండగా ఆమె వేసుకున్న దుప్పటా ఉన్నట్లుండి పడిపోయింది. దీంతో మెషిన్ రన్నింగ్ లో ఉండటంతో ఆమె అనుకోని ప్రమాదంలో పడిపోయింది. మెషిన్ తో పాటు ఆమె తిరగడం వలన ఆమె తలకు భారీగా గాయాలయ్యాయి. పక్కనే ఎవరూ లేకపోవడం వలన ఆ గాయాలకు సృహ కోల్పోయి కింద పడిపోయింది. పోలీసులు, అక్కడే ఉన్న ఫైర్ సిబ్బంది వచ్చి ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తలకు భారీగా గాయాలు కావడంతో ఆమె ప్రాణాలు వదిలేసింది.

మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

మహిళలు ఎప్పుడో ఒక్కసారి ఇలా మీరు చేస్తూ ఉంటారు కాబట్టి, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దుస్తులు సరిగ్గా ఉంచుకోవడం, ఆ మెషిన్ కు కరెంట్ షాక్ వంటివి వస్తుంటే చెప్పులు ధరించడం, మెషిన్ మీద చేతులు వేసి నిర్లక్ష్యంగా నిలబడటం.. ఇలా ప్రతి ఒక్కటీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో అంటే మిక్సీ ఉంటాయి పర్లేదులే అనుకోవచ్చు, అక్కడ కూడా మిక్సీపై మూతలు పెట్టుకోవడం మర్చిపోవడం చేయకూడదు, కొందరు మిక్సీ స్విచ్ ఆన్ చేసి మరిచిపోయి వెళుతూ ఉంటారు. అది కూడా ప్రమాదకరమే.

మహిళలు మీరు బాగుంటేనే కదా మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోగలరు. అందుకే పైన చెప్పిన సలహాలు తప్పక పాటించండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon