Link copied!
Sign in / Sign up
0
Shares

నిద్రపోయేటప్పుడు ఎటువైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది..!

ఒక మనిషి ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పడానికి ఆ వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు అర్థం. ఏదైనా ఒక పనిలో శ్రద్ధగా పనిచేస్తున్నట్లయితే అతడు నిద్రించే సమయం కూడా ఎంతో ముఖ్యం. ఐతే ఉదయం నుండి రాత్రి పడుకునేవరకు అలసిపోయిన ఈ శరీరానికి ప్రశాంతవంతమైన నిద్ర చాలా అవసరం. అయితే ఎటువైపు పడుకుని నిద్రిస్తే మంచిది, ఎటువైపు పడుకుని నిద్రించకూడదు అని చాలామందికి ఉన్న అనుమానం. అందుకే మీ సందేహాలు తీర్చడానికి ఈ ఆర్టికల్ మీకోసం…

ఎటువైపు పడుకుని నిద్రిస్తే మంచిది..?

ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణులు చెప్పిన ప్రకారం ఎడమవైపు తిరిగి పడుకుని నిద్రించడం శరీరానికి చాలా మంచిదట.  ఇలా పడుకుని నిద్రించినట్లయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని అంటున్నారు నిపుణులు. కొందరిపై ఈ పరిశోధనలు చేయగా కుడివైపు పడుకుని నిద్రించే వారికన్నా ఎడమవైపు పడుకుని నిద్రించేవారే ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అదే కుడివైపు పడుకుని నిద్రించేవారు ప్రశాంతంగా లేనట్లు, అలసటగా ఉన్నట్లు, యాక్టివ్ గా కూడా ఉండటం లేదని చెప్పారు.

ఎడమవైపు పడుకుని నిద్రిస్తే కలిగే లాభాలు :

1.ఎడమవైపు పడుకుని నిద్రించడం వలన జీర్ణప్రక్రియ బాగా జరుగుతుంది.

2.రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

3.గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలతో బాధపడేవారికి ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచి ఉపశమనం అని చెప్పాలి.

సో, అందుకని మీరు నిద్రించేటప్పుడు వీలైనంతవరకు ఎడమవైపు తిరిగి పడుకోవడానికే ప్రయత్నించండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon