Link copied!
Sign in / Sign up
0
Shares

వేసవిలో మీ అందాన్ని రెండింతలు పెంచే సహజమైన ఫేస్ ప్యాక్స్ : ఇంట్లోనే వేసుకోవచ్చు

Image Courtesy : Fitness Comes First

ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి బయటకు వెళ్లి ఇంటికి వస్తే మళ్ళీ గుర్తుపట్టడం కష్టమేమో అనిపించేలా సూర్యుడి సెగలు భయపెడుతున్నాయి. సమ్మర్ లో బయటకు వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే చర్మం నల్లగా మారటం, ముఖంపై వేడిగుల్లలు, మొటిమలు, నల్లని మచ్చలు.. ఇలా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పుకునే విధంగా మీ అందాన్ని కాపాడే ఈ సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్స్ ను ఇంట్లో వేసుకోవడం వలన మీ ముఖాన్ని అందంగా ఉంచుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం..

పుచ్చకాయ, కీరదోస

సమ్మర్ లో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన మీ ముఖం జిడ్డుగా లేదా అలసటగా ఉన్నప్పుడు వెంటనే ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం లేదా నాలుగు పుచ్చకాయ ముక్కలను తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కీరదోస కాయ రసం కలుపుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకుని 30 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మీ ముఖం తాజాగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.

ముఖం అందంగా, తేమగా ఉండాలంటే

సమ్మర్ లో కొంతమంది చర్మం పొడిగా ఉంటుంది. ఇలా ఉండటం వలన చర్మం మంటగా ఉండటం, పొలుసులుగా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు తేమగా ఉండేలా చేసుకోవాలి. పైన చెప్పుకున్నట్లుగానే ఒక చిన్న గిన్నెలోకి గింజెలు తీసివేసిన పుచ్చకాయ ముక్కలు లేదా పుచ్చకాయ రసాన్ని కలుపుకుని అందులో ఒక స్పూన్ తేనెను మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిముషాల తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకున్నట్లయితే ముఖంపై తేమగా ఉండి అందంగా మరియు కాంతివంతంగా మెరిసిపోతుంది.

కలబంద మరియు పుచ్చకాయ

ఇది చాలామంది నిపుణులు చెప్పిన అందమైన మరియు సింపుల్ చిట్కా. సులభంగా కూడా చేసుకోవచ్చు. ఒక గిన్నెలో పుచ్చకాయ రసం తీసుకుని తాజా కలబంద నుండి కలబంద గుజ్జు ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు, చర్మంపై రాసుకోవడం వలన తేమగా ఉండేలా చేస్తుంది.

చర్మంపై రంధ్రాలు మరియు నల్లని మచ్చలు

మిగతా సీజన్ లతో పోల్చుకుంటే సమ్మర్ లో ముఖం, చర్మాన్ని అందంగా, తాజాగా ఉంచుకోవడం కాస్త కష్టమైన పనే. ముఖ్యంగా కొందరి ముఖంపై నల్లని మచ్చలు, చిన్న చిన్న రంధ్రాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకని ఒక చిన్న పుచ్చకాయ రసంలో కాసిన్ని పాలు కలుపుకుని మిక్స్ చేసి, ముఖంపై అప్లై చేసుకున్నట్లయితే పేస్ పై ఉన్న రంధ్రాలు, నల్లని మచ్చల నుండి కాస్త రిలీఫ్ ఉంటుంది.

మీ అందాన్ని కాపాడే ఈ సహజ సిద్ధమైన చిట్కాలను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే సమ్మర్ లో పుచ్చకాయలు విరివిగా ఉంటాయి, కాబట్టి ఫేస్ ప్యాక్ వేసుకోవడాని వేసుకోవడం కూడా అంత కష్టమైన పనేమీ కాదు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon