Link copied!
Sign in / Sign up
2
Shares

తలస్నానానికి వేడి నీరు మంచిదా..! చల్లని నీరు మంచిదా..! మీ జుట్టు బలంగా ఉండటానికి..

ఒకరు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నారు అంటే వారి ముఖం, ముక్కు, పెదాలు మాత్రమే చూడరు. తలపై జుట్టును కూడా చూస్తుంటారు. రింగురింగుల జుట్టు, పొడవాటి జుట్టు, అందంగా వేలాడే జుట్టు.. ఇలా గమనిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో వివిధ రకాల షాంపూలు, సబ్బులు తలకు ఉపయోగించడం వలన త్వరగా జుట్టు రాలడం సమస్యతో బట్టతల వచ్చి బాధపడుతున్నారు చాలామంది. అలాగే తలస్నానానికి ఏ నీరు వాడటం వలన మీ జుట్టును అందంగా ఆకర్షణీయంగా ఉంచుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి..

తలస్నానానికి వేడి నీరు వాడితే..

తలస్నానానికి వేడి నీరు ఉపయోగించడం వలన జుట్టు అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవచ్చు. ఐతే మరీ ఎక్కువగా వేడిగా ఉండకుండా గోరు వెచ్చగా నీరు ఉండేలా చూసుకోవాలి. గోరువెచ్చని నీరు తలస్నానానికి ఉపయోగించడం వలన తలపై చుండ్రు సమస్యలు ఉండవు. అలాగే జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు. అంతే కాకుండా తలపై దుమ్ము, ధూళి ఉన్నప్పుడు, మురికిగా ఉన్నప్పుడు, తలకు ఆయిల్ రాసుకున్నప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. తలస్నానానికి షాంపూ ఉపయీగించే వారు తలపై షాంపూ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలు ఉంటాయి. షాంపులకు బదులుగా కుంకుడుకాయలు ఉపయోగించడం మంచిది.

చల్లనీరు తలస్నానానికి..

మీరు మొదటి నుండి తలస్నానానికి చల్లని నీరు వాడుతూ ఉంటే ఇలా చేయడమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వేడి నీరు తలస్నానానికి ఉపయోగించడం వలన జుట్టు తేలిక అవ్వడం, బలం కోల్పోవడం, కొందరిలో తలనొప్పిగా ఉండటం, చుండ్రు సమస్యలు వస్తూ ఉంటాయి. మొదటి నుండి చల్లని నీరు ఉపయోగించడం వలన చాలా లాభాలే ఉన్నాయి కూడా. చల్లని నీటితో స్నానం చేయడం వలన రోజంతా ఆక్టివ్ గా ఉండేలా ఉపయోగపడుతుంది. చల్లని నీరును స్నానానికి ఉపయోగించేవారిలో వ్యాధుల బారిన తక్కువ పడినట్లు కూడా చెబుతున్నారు. అంటే వీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.  అలా అని వేడినీరు ఉపయోగించడం వలన అనారోగ్యం పాలవుతారని కాదు.

సో, చూశారు కదా.. తలస్నానానికి ఏ నీరు వాడితే మంచిదో. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో వేడి నీరు, చల్లని నీరు వాడటం ఉపయోగకరమో. మీ అందరికీ ఒక చిన్న విన్నపం, మీ పిల్లలకు షాంపూలు, కెమికల్స్ ఉన్నటువంటి ఈ సబ్బులను తలస్నానానికి వాడకుండా మన పెద్దలు ఫాలో అయిన కుంకుడు కాయలు వాడి చూడండి. వారికి అందమైన ఆరోగ్యమైన జుట్టును ఇచ్చిన వారవుతారు. మీకు ఇలాంటి అందమైన చిట్కాలు తెలిసి ఉంటే మాకు కామెంట్ ద్వారా తెలుపవచ్చు.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon