Link copied!
Sign in / Sign up
15
Shares

వ్యాయామం అవసరం లేకుండా శరీరం నుండి కొవ్వును బయటకు పంపించగలిగే 6 పానీయాలు

అందరూ బరువు తగ్గాలనుకుంటారు కానీ అందుకు తగ్గ శ్రమ చేయలేరు. వ్యాయామాలు మొదలు పెట్టిన మొదటి నాలుగు రోజులు క్రమం తప్పకుండా చేస్తారు తరువాత మాములే, రోజు వాయిదా వేసుకుంటూ వ్యాయామాన్ని మూలకు పడేస్తారు. బరువు తగ్గాలనుకున్న మీ కోరిక మూలన పడిపోతుంది. అందుకే మీరు శరీర శ్రమ చేయకుండా మీ వంట్లోని కొవ్వుని బయటకు పంపించి మీ బరువును తగ్గించే పానీయాలేంటో,వాటిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి….

1. గ్రీన్ స్మూతీ (Green Smoothie)

ఈ పానీయాన్ని మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఒక అరగంట ముందు తీసుకోవాలి. ఇది మీ జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. మీరు తీసుకున్న ఆహరాన్ని పూర్తిగా అరిగించి, మీ బరువును పెంచే కార్భోహైడ్రేట్స్ కాకుండా శక్తిని మాత్రమే శరీరానికి అందిస్తాయి. దీనిని ఎలా తయారుచేసుకోవాలి ఇక్కడ చూడండి…

కావాల్సిన పదార్ధాలు:

పైన్ ఆపిల్ - ఒక ముక్క

కీరా - ఒక ముక్క

ముల్లంగి - ఒక ముక్క

వీటిని మిక్సీలో బ్లెండ్ చేయాలి. తగినంత నీరు కలుపుకోండి.

2. ద్రాక్ష, ఆపిల్ వెనిగర్

ఇది శరీరంలోని టాక్సిన్స్ ను, విషపదార్ధాలను, శరీరం నుండి బయటకు పంపిస్తుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు :

ద్రాక్ష రసం - ఒక కప్పు

ఆపిల్ వెనిగర్ - ఒక టేబుల్ స్పూన్

ఈ పాళ్ళలో వీటిని కలుపుకుని, రోజు తీసుకోండి. ఇది మీ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది.

3. నిమ్మ రసం, సబ్జా

సబ్జా గింజలు శరీరంలోని విష పదార్ధాలను తొలిగిస్తాయి, శరీరాన్ని శుభ్రపరుస్తాయి. వీటిని నిమ్మ రసంతో కలిపి తీసుకున్నప్పుడు అది మీ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది.

కావాల్సిన పదార్ధాలు :

నిమ్మ రసం - ఒక కప్పు

సబ్జా గింజలు - రెండు టేబుల్ స్పూన్

నీళ్ళు - ఒక గ్లాసు

ఒక గ్లాసు నీళ్ళలో ఒక కప్పు నిమ్మ రసం కలుపుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు అందులో వేయండి. పది నిముషాలు వాటిని అందులో నాననివ్వండి. తర్వాత తాగండి.

4. అల్లం నిమ్మ రసం

అల్లానికి అనేక ఔషధ గుణాలున్నాయి. అల్లం శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అరుగుదల శక్తిని పెంచుతుంది. కొవ్వు శరీరంలో పేరుకుపోకుండా చూస్తుంది. అల్లాన్ని నిమ్మ రసంతో కలిపి తీసుకున్నప్పుడు ఇంకా మంచి ఫలితాలుంటాయి.

కావాల్సిన పదార్ధాలు:

నిమ్మ రసం - ఒక కప్పు

అల్లం - చిన్న ముక్క

అల్లాన్ని మెత్తగా దంచి నీళ్ళలో వేసి మరిగించండి. ఇందులో నిమ్మ రసం వేసి కలుపుకోండి. దీనిని రోజులో మీకు కావలసినప్పుడు తాగచ్చు.

5. బేకింగ్ సోడా, పండ్ల రసం

వివిధ రకాల వంటల్లో వాడే బేకింగ్ సోడా, మీ కొవ్వును తగ్గించగలదు. అందుకు మీరు బేకింగ్ సోడాను ఈ విధంగా తీసుకోవాలి….

కావాల్సిన పదార్ధాలు:

ఏదైనా పండ్ల ముక్కలు - ఒక కప్పు

పుదీనా - 4 ఆకులు

బేకింగ్ సోడా - 1 టేబుల్ స్పూన్

నీళ్ళు - రెండు కప్పులు

నిమ్మ రసం - రెండు కప్పులు

వీటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. రెండు రోజులకు ఒక సారి తీసుకోండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon