Link copied!
Sign in / Sign up
4
Shares

బిడ్డ వ్యాధి తగ్గిస్తానని నెల చిన్నారిపై యాసిడ్ పోసిన మహిళ : పరిస్థితి విషమం..

చిన్న పిల్లలను బలియిస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మంత్రాలతో తంత్రాలతో మీ బిడ్డలను బ్రతికిస్తాము అంటూ ఇంకా అమాయక ప్రజలతో, వారి ఆరోగ్యాలతో ఆడుకుంటూ డబ్బులు సొమ్ముచేసుకుంటున్నారు కొందరు. మూడు రోజుల క్రితం పుట్టి నెల అయినా గడవని ఒక బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ వ్యాధి తగ్గడానికి యాసిడ్ పోసి ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన ప్రస్తుతం దేశమంతటా వైరల్ అయ్యింది. అసలేం జరిగిందంటే..

న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి..

న్యుమోనియా.. ఊపిరితిత్తులలో మంటను కలిగించే పరిస్థితినే న్యుమోనియా అంటారు. ఇన్ఫెక్షన్స్, వైరస్, అంటురోగాల వలన ఈ వ్యాధి వస్తుంది. రాజస్థాన్ లోని మారుమూల గ్రామానికి చెందిన ఓ దంపతులకు నెల క్రితం జన్మించిన తమ బిడ్డ అనారోగ్యంగా ఉండటంతో న్యుమోనియా అని తెలిసింది. తమ బిడ్డ ఆరోగ్యం నయం చేస్తుందని రాజస్థాన్ లోని సవై మధోపూర్ అనే జిల్లాలో పిల్లల అనారోగ్యం నయం చేసే ఓ మహిళ దగ్గరకు వెళ్లారు. ఆ బిడ్డను చూసి యాసిడ్ కెమికల్స్ ను చిన్నారి చెస్ట్ పై చెల్లింది. యాసిడ్ కారణంగా కాళ్ళు, చెస్ట్ కాలిపోయాయి. దీంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

డాక్టర్లు చూసి భయపడ్డారు..

నెలల బిడ్డకు ఎవరు ఈ విధంగా చేశారని డాక్టర్ ఆ తల్లితండ్రులను అడగగా ఆ మహిళ గురించి చెప్పారు. వెంటనే డాక్టర్ పోలీసులకు చెప్పగా ఆమెను అరెస్ట్ చేశారు. ఇది అక్కడ కొత్తదేమీ కాదంట, చిన్నపిల్లల ఆరోగ్యాన్ని కాపాడతాను అని ఆమె ఇలాంటివెన్నో చేస్తూ ఉంటుందని ఆ చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు. 4 నెలల బిడ్డ దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటే కాల్చిన ఐరన్ రాడ్ తో చర్మంపై పెట్టిందట. ఇలా చేస్తే పిల్లలు రోగాలు నయం అవుతాయని వాళ్ళు నమ్ముతున్నారు.

ఇలాంటి వాళ్ళ ఆగడాలు అందరికీ తెలిసేలా, ఇక ఏ బిడ్డకు మళ్ళీ ఇలా జరగకుండా అందరికీ తెలిసేలా SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon