Link copied!
Sign in / Sign up
5
Shares

ఉద్యోగం చేసే తల్లులు పిల్లల కోసం సులభంగా చేయగలిగే స్నాక్స్


ఉద్యోగం చేసే తల్లులు  పిల్లలకి రక రకాల స్నాక్స్ చేసి పెట్టడం అనేది కొంచెం కష్టం అయిన పని. పిల్లలికి తినాలనే ఆసక్తి కలిగించడం అనేది అంత సులభం కాదు. వారి వెనుక పరిగెడుతూ తినిపించాడానికి ఎన్నో పాట్లు పడి గడిపే నిద్ర లేని రాత్రులు కూడా ఎన్నో ఉంటాయి. రుచి గా మరియు ఆరోగ్యవంతమైన స్నాక్స్ చేయడం చిన్న విషయం కాదు. కుదిరినంత వరకు ప్రయత్నించండి అలాగని పిల్లలు తినకపోతే అది మీ తప్పు కాదు. ఈ జాబితా లో ఉన్న స్నాక్స్ ను తక్కువ సమయము లో సులభంగా తయారు చేయవచ్చు.

1 . పండ్లు

ఉద్యోగం చేసే తల్లులకు అతి సులువైన స్నాక్స్ పండ్ల ముక్కలు ( ఫ్రూట్ సలాడ్) . ఉట్టి పండ్ల ముక్కలను పెడితే వదలకుండా పిల్లలు మొత్తం తింటారు అని చెప్పలేము. అందువలన పండ్ల ముక్కలు పైన మెల్టెడ్ హాట్ చాక్లేట్ సిరప్ గాని నూటెల్లా స్ప్రెడ్ గాని వేయండి. అది పిల్లలకి తినాలనే ఆసక్తి కలుగచేయడం మాత్రమే కాకుండా కొత్త మిత్రులు పరిచయం అయ్యే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.

2 . గోధుమ,ఓట్స్ 

కెళ్ళొగ్స్ చాకోస్ పిల్లలకి బాగా నాచే అవకాశం ఉంది. దీనిని పాలు తో కలిపి ఇచ్చినట్లు అయితే రోజు కి సరిపడా పోషక పదార్ధాలను గోధుమ రూపం లో అందజేస్తుంది . అంతే కాదండోయ్ ఇది చాక్లేట్ ఫ్లేవర్ గనుక పిల్లలకు బాగా నచుతుంది. ఇది పొద్దున్న టిఫిన్ గాను స్నాక్స్ గాను పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. కార్న్ ఫ్లెక్స్ పైన తేనే పోసి ఇవ్వడం లేదా హనీ లూప్స్ కూడా పిల్లలు ఇష్టపడుతారు.

3 . యోగర్ట్ (పెరుగు)

యోగర్ట్ లో రాస్బెర్రీ, గ్రీన్ ఆపిల్, బ్లూబెర్రీ లాంటి ఫ్లేవర్లు సమయం లేని పక్షం లో బాగా సహాయపడుతాయి స్నాక్స్ గా. ఇది పోషక పదార్ధాలు కలిగి ఉన్నది మరియు రుచి గాను కలర్ఫుల్ గాను ఉంటుంది.

4 . డ్రై ఫ్రూప్ట్స్

డ్రై ఫ్రూప్ట్స్ తినటం మీ పిల్లలకి అంతగా నచ్చకపోవచ్చు. కానీ వాటిని తెలివిగా వాటిని సాఫ్ట్ గా ఉండే ఇంట్లో తయారుచేయబడిన మెఫిన్స్ లో పిల్లలకి తెలియకుండా దాచి కనిపెట్టలేని విధంగా

ఇవ్వండి. మెఫిన్స్ పైన న్యూటల్లా పూసి ఇస్తే గనుక మీ పిల్లలు నోరు ఊరిస్తుంది. అలాంటప్పుడు తినకుండా ఉండలేరు గా.

5 . చిక్కి

ఈ స్నాక్స్ లో వేరుశెనగ మరియు తేనే ఒక్క మంచి పోషక గుణాలు వలన వారి కడుపు కి మంచిది. చిన్న పిల్లలకి చిక్కి తినడం కొంచెం ఇబ్బంది గా ఉంటుంది. అందువలన చిక్కి బదులుగా గోధుమ బిస్కెట్లు , మరియు రొండు స్లైసెస్ మధ్యలో జ్యామ్ లేదా మార్మాలాడే పూసి ఇచ్చినట్లు అయితే పిల్లలకి తినాలనే ఆసక్తి కలుగుతుంది.

6 . వేపిన సెనగకాయలు.

ఇది ఎక్కువగా తింటే పిల్లలకి లూజ్ మోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పిల్లలకి తక్కువ మోతాదు లో ఇస్తే మంచిది.

7 . మైక్రోవేవ్ పాప్ కార్న్

పాప్ కార్న్ ని మైక్రోవేవ్ లో చేయటం వలన క్యాలరీలను మాములుగా చేసినపుడు కన్నా కంటే తగ్గిస్తుంది. మైక్రోవేవ్ లో పాప్ కార్న్ చేయడం వలన నూనే వాడకం తగ్గించటమే కాకుండా రుచి గాను ఉంటుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon