Link copied!
Sign in / Sign up
1
Shares

భార్య కట్నం తీసుకురాలేదని స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన భర్త : అత్యంత దారుణం

వేదమంత్రాల సాక్షిగా తొమ్మిది అడుగులు వేసి, ఏడు జన్మలు నీతోనే ఉంటానంటూ, నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఇద్దరినీ ఒక్కటి చేసేదే పెళ్లి. వేలు పట్టుకుని నీకు తోడుగా నేనున్నాను అని అండగా ఉండాల్సిన వాడే తన స్నేహితులతో కలిసి తన జీవితాన్ని నాశనం చేస్తాడని ఆ ఆడపడచు కలలో కూడా ఊహించి ఉండదేమో. అలాంటి అత్యంత దారుణమైన సంఘటన వింటుంటూనే ఎంతో బాధగా ఉంది కదూ. మరి ఈ ఆడ కూతురికి జరిగిన అన్యాయం వింటే గుండె తరుక్కుపోతుంది.. 

కట్నం ఇంకా తీసుకురాలేదని..

మనదేశంలో వధువుకు కట్న కానుకలు, బహుమానాలు ఇచ్చి కూతురును ఇచ్చి పెళ్లి చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దక్షిణ అస్సాంలోని కరీంగంజ్ అనే జిల్లాలో నివాసముంటున్న ఈ బాధితురాలు తల్లితండ్రులు తమ కూతురిని వివాహం చేసుకుంటే తమకు చేతనైన డబ్బు మరియు కొద్దిగా బంగారం ఇస్తామని పెళ్లికి ముందు చెప్పుకున్నారు. పెళ్లి జరిగి 3 రోజులు అయినా సరే ఇంకా కట్నం తీసుకురాలేదని తన భార్యపై కోపంగా ప్రవర్తించేవాడు భర్త. మూడు రోజుల తర్వాత తన ఇద్దరు స్నేహితులతో ఇంటికి వచ్చి కట్నం ఇవ్వలేదనే కారణంతో అత్యాచారం చేసి ముగ్గురు పరారయ్యారు.

నోట్లో గుడ్డలు పెట్టి హింసించారు

కట్టుకున్న భర్తే తన భార్యను ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారం చేశాడు. ఈ సమయంలో ఆమె అరవకుండా, అరుపులు బయటకు వినిపించకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టి బాధపెట్టారు. ఆమెను ఆ స్థితిలో వదిలేసి పరారయ్యారు. తమ ఇంటికి దగ్గరలోని బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పగా, భర్తను అరెస్ట్ చేశారు. అతడి ఫ్రెండ్స్ పరారీలో ఉండటంతో పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. సహధర్మ చారిని దగ్గరుండి రక్షించాల్సిందిపోయి ఇలా దారుణంగా ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఇటువంటి దుర్మార్గులను ఏం చేయాలో మీరే చెప్పండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon