Link copied!
Sign in / Sign up
23
Shares

యోని గురించి ప్రతి మహిళ అడగాలనుకునే 4 ప్రశ్నలు వాటి సమాధానాలు

మన దేశంలో, సమాజంలో స్త్రీల యొక్క సున్నితమైన బాగాల గురించి, సమస్యల గురించి మాట్లాడటాన్ని చాలా తప్పుగా చూస్తారు. దీని వల్ల చాలా మంది మహిళలకు  వారి సమస్యల మీద అవగాహన లేకుండా పోయింది. మీ శరీరం గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవేంటంటే,

సెక్స్ చేసినప్పుడు మాత్రమే కన్నెపొర తొలిగిపోతుందా?

కన్నెపొర అనేది మీ వెజీనాలో ఉండే ఒక చిన్న పొర. మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈపొర తొలగిపోతుంది. అంతేకాక, మీరు ఏవైనా ఎక్సర్‌సైజులు చేసినా భౌతిక శ్రమ చేసినా కొంచెం బ్లీడింగ్ అయ్యి ఈ పొర తొలగిపోయే అవకాశం ఉంది. కొందరికి కన్నెపొర ఉండకపోవడం కూడా  జరగవచ్చు. ఈ విషయం గురించి చాలా మందికి అవగాహన ఉండదు.

సెక్స్ చేయడం వలన యోని సైజు పెరుగుతుందా?

మీరు శృంగారంలో పాల్గొనేటప్పుడు వెజీనా వ్యాకోచిస్తుంది. వెజీనాలోని పైభాగం దాదాపు రెండు రెట్ల వరకు వ్యాకోచించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఎక్కువ పరిమాణంలో ఉన్న పీనస్ కూడా సులభంగా లోపలికి వెల్తుంది. మీకు ట్యాంపన్ ధరించే అలవాటు ఉంటే నిరభ్యంతరంగా ధరించవచ్చు.

స్త్రీలు ఎక్కువ శృంగారాన్ని ఆస్వాదించగలరా?

ఆడవారికి వెజినా దగ్గర శృంగారాన్ని ఆస్వాదించే నరాలు దాదాపు 8 వేలు ఉంటాయి. అయితే ఇవి మగవారిలో కేవలం 4 వేలు ఉంటాయి. దీని వల్ల స్త్రీ శృంగారాన్ని ఎక్కువ ఆస్వాదించగలుగుతుంది మరియూ నరాల పొడవు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ బావప్రాప్తిని పొందుతుంది.

తినే ఆహారం వాజినా వాసనను మారుస్తుందా?

వెజినా సువాసన రావడానికి మీరు తినే ఆహారం దోహదం చేస్తుంది. కొన్ని ఆహారపధార్థాలు తినడం వల్ల మీ వెజినా చెడు వాసన రావచ్చు దీని వల్ల మీ భర్త శృంగారం పట్ల అయిష్టత చూపవచ్చు. పైనాపిల్ వంటి పళ్ళు తింటే అక్కడ కూడా అలాంటి వాసన వచ్చి మీ పార్ట్నర్ సెక్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించే అవకాశం ఉంది

వెజిన శుభ్ర పరుచుకోవాలా?

ఇప్పుడు జననేంద్రియాలను శుభ్రపరచుకోవడానికి చాలా పరికరాలు, కాస్మోటిక్స్ వచ్చేశాయి కానీ తెలియని విషయం ఏమిటంటే, వెజినాను తనకు తానుగా శుభ్రపరచుకోవడానికి కావల్సిన శక్తి వెజినాకు ఉంటుంది. మీరు సబ్బుతో క్లీన్ చేసినప్పటి కన్నా వెజినా స్వీయ శుభ్రత వల్ల అక్కడ ఎక్కువ క్లీన్ అవుతుంది.

ఎక్కువ సెక్స్ చేస్తే వాజిన వదులవుతుందా?

ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే వెజినా లూజ్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది బావిస్తారు కానీ వెజినా చుట్టూ ఉండే ఖండరాల వల్ల దానికి సంకోచించే, వ్యాకోచించే స్వభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా సెక్స్ చేసినా మీ వెజినా సాగిపోదు. అయితే, పిల్లలు పుట్టిన తర్వాత, వయసు పెరగడం వంటి వాటి వల్ల వెజినా వదులు అయ్యే అవకాశం ఉంది.

వెజీనల్ క్లాంపింగ్ అంటే ఏంటి ?

వెజినా వదులుగా అనిపించిన వాళ్ళకు వైద్యులు వెజీనల్ క్లాంపింగ్ పెట్టించుకోండని సలహా ఇస్తారు. దీని వల్ల పురుషాంగం లోపలికి వెళ్ళిన తర్వాత గట్టిగా పట్టడం జరుగుతుంది. దీని ద్వారా వెజినా వదులైనట్లు మీ భర్తకు అనిపించదు. మీరు మునుపటి శృంగారాన్ని తిరిగి పొందవచ్చు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon