Link copied!
Sign in / Sign up
13
Shares

‘వెజ్ బిర్యానీ’ : పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే ఫుడ్, 15 నిముషాల్లో బ్రహ్మాండంగా ఎలా చేయాలో చూడండి..

మన తెలుగువాళ్లు భోజన ప్రియులు, రుచికరంగా వంటలు చేస్తే మహా ప్రసాదంగా భావిస్తూ సంతృప్తికరంగా ఆరగిస్తారు. అయితే కొన్ని కొన్ని వంటలు ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియకపోవడం వలన మంచి రుచులను మిస్ అయిపోతున్నారు. ఎన్ని వంటలు చేసుకున్నా, ఎంత రుచికరంగా తయారుచేసుకున్నా సరే వాటివలన మంచి ఆరోగ్యం, బలం చేకూరడం ముఖ్యం కదా. అలా ఆరోగ్యాన్ని ఇస్తూ బలాన్ని ఇచ్చే ఫుడ్ ‘వెజ్ బిర్యానీ’. ఇది తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, ఎలా తయారుచేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకోండి..

వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు :

బాస్మతి రైస్ - అర కిలో

నెయ్యి - 2 స్పూన్లు

క్యారెట్ ముక్కలు - ఒక కప్పు

పచ్చి బఠాణీ - ఒక కప్పు

పచ్చి మిర్చి - 8

ఉల్లిపాయలు - 2

పుదీనా ఆకులు - 8

టమోటాలు - 4

బీన్స్ ముక్కలు - ఒక చిన్న కప్పు

బంగాళాదుంపలు - రెండు లేదా మూడు

జీడిపప్పు - పది

మెంతి కూర - ఒక కట్ట

పలావ్ ఆకు - 1

అల్లం వెల్లుల్లి - రెండు స్పూన్లు

పసుపు, కారం - ఒక స్పూన్

ఉప్పు - తగినంత

నూనె - అరకప్పు

కొత్తిమీర - ఒక కట్ట

గరం మసాలా - ఒక టీ స్పూన్

పెరుగు - ఒక కప్పు

వెజ్ బిర్యానీ తయారీ విధానం :

1. వెజ్ బిర్యానీ తయారు చేసుకునే అరగంట ముందు బాస్మతీ రైస్ ను నానబెట్టుకోవాలి.

2. కడాయి తీసుకుని అందులో కాస్త నెయ్యి వేసుకుని మసాలా దినుసులు, పలావ్ ఆకు మరియు జీడిపప్పు వేసి వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

3. ఆ తర్వాత అదే కడాయిలో నెయ్యి లేదా కొంచెం నూనె వేసి పచ్చి మిర్చి, కూరగాయ ముక్కలు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ఉల్లిపాయలతో పాటు కప్పు పెరుగు వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

4. గ్లాసు బియ్యం వేసుకుంటే నీరు ఒక గ్లాసున్నర్ర వేసుకోవాలి. ఇలా నీటిని ఎలక్ర్టిక్ స్టవ్ లేదా కుక్కర్ లో తీసుకుని అందులో కొత్తిమీర, మెంతి కూర, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత కిందకు దించుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి.

5. చివరిగా కడాయి తీసుకుని అందులో నెయ్యి లేదా నూనె వేసుకుని అంతకుముందు వేయించిన కూరగాయ ముక్కలు మరియు మసాలా దినుసులు, పెరుగు మిశ్రమాన్ని అన్నంతో పాటు కడాయిలో వేసి బాగా కలియబెట్టి కొద్దిసేపు మరీ ఎక్కువ మంట లేకుండా వేడి చేయాలి. దీంతో వెజ్ బిర్యానీ రెడీ అయినట్లు.

ఘుమఘుమలాడే ఈ వెజ్ బిర్యానీని మీ ఇంటిల్లిపాదికీ వడ్డించండి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే వెజ్ బిర్యానీ చేసుకోవడం  ఎంత సులువో చూశారు కదా. ఇది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon