వర్షాకాలంలో మీ పిల్లలపట్ల తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు : లేకపోతే ఈ వ్యాధులు తప్పవు
వర్షాకాలంలో శరీరాన్ని వ్యాధులు త్వరగా చేరుతుంటాయి. వర్షానికి తడిచినా, వర్షంలో నడిచినా, తీసుకునే ఫుడ్..ఇలా ఎన్నో రకాలుగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వయస్సు పై బడుతున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరూ ఈ మాన్ సూన్ సీజన్ లో ఈ చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. ఈ విషయాలు అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి.
ఆరోగ్యకరమైన డైట్
వర్షాకాలంలో చాలామంది జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీని కారణంగా శరీరాన్ని త్వరగా ఇన్ఫెక్షన్స్ చేరడం జరుగుతూ ఉంటుంది. అందుకే తాగే నీరు ఫిల్టర్ లేదా వేడి చేసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వలన బాక్టీరియా చేరకుండా నిరోధించవచ్చు. అలాగే బయటి ఫుడ్స్, మసాలా పదార్థాలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.
నీరు ఎక్కువగా తీసుకోవడం
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వలన చాలావరకు నీటిని తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. నీరు తాగితే మళ్ళీ వెంటనే మూత్రానికి వెళ్లాల్సి ఉంటుందని నీరు తీసుకోవడం తగ్గించివేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు, వీలైనంత వరకు ఎక్కువ నీటిని సేవించాలి, టీ కాఫీ లకు బదులుగా హెర్బల్ టీ, గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. నీరు తక్కువగా తీసుకోవడం వలన నోట్లో పుండ్లు, కడుపునొప్పి, తల నొప్పిగా ఉండటం, కళ్ళు మంటలు మరియు ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం జరుగుతుంది.
వర్షంలో ఇలా చేయకూడదు

ప్రస్తుతం ఎటువంటి అనారోగ్య సమస్యలు అందరినీ వేధిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. వర్షంలో తడిచినా, వర్షంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నడవటం వలన వైరల్ డిసీజెస్ త్వరగా శరీరాన్ని ఇబ్బందికి గురిచేస్తాయి. అందుకే వర్షంలో వెళ్ళేటప్పుడు లేదా బయటకు వెళ్తున్నప్పుడు మీతో పాటు, పిల్లలకోసం గొడుగు, రైన్ కోట్ వెంటబెట్టుకోవడం చేయాలి. అలాగే పిల్లల దుస్తులు లేదా బెడ్ పై కప్పుకుని దుస్తులు చల్లదనం లేకుండా చూసుకోవాలి.
రోజుకి రెండుసార్లు స్నానం
పిల్లలైనా, పెద్దలైనా సరే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు స్నానం చేయడం చేయాలి. శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ను ప్రోత్సహించకుండా బయటినుండి వచ్చినప్పుడు త్వరగా స్నానం చేయడం వలన ఫ్రెష్ గా ఉంటారు మరియు ఆరోగ్యానికి మంచిది కూడా. శరీర రోగ నిరోధక శక్తి తక్కువ కాకుండా విటమిన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం మంచిది.
కళ్ళను రుద్దటం చేయకండి

మీరు బాగా గమనించారో లేదో వర్షాకాలంలో ఎక్కువగా కాళ్ళ ఇన్ఫెక్షన్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. పిల్లలలో ఇది కాస్త అధికంగా ఉంటుంది. కళ్ళు పొడిబారినప్పుడు, మంటగా ఉన్నప్పుడు, కనురెప్పల వద్ద మసకగా ఉన్నప్పుడు వెంటనే చేతులతో రుద్దటం చేయకుండా నీటితో శుభ్రం చేసుకోవడం చేయాలి. ఇలా చేయడం వలన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇవండీ వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం చేయకూడదో తెలుసుకున్నారు కదా. ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామెంట్ చేసి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
.....................................................................................................
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
