Link copied!
Sign in / Sign up
19
Shares

వరలక్ష్మి వ్రతం గురించి స్వయంగా పరమ శివుడు పార్వతీ దేవికి చెప్పిన కథ ఏమిటి?


ఒక రోజు పార్వతి దేవి ప్రతి స్త్రీకి ఐశ్వరం, ఆరోగ్యం మరియు పుత్రపాప్తి కలగడానికి ఏదయినా వ్రతం సూచించమని పరమ శివుడిని కోరింది. అప్పుడు సాక్షాత్తు పరమ శివుడు వరలక్ష్మి వ్రతం గురించి తెలియచేసి, ఈ వ్రతమును ఆచరించమని సూచించాడని స్కంద పురాణం చెబుతోంది. అంతే కాకుండా, పార్వతి దేవికి చారుమతీదేవి వృతాంతాన్ని కూడా తెలియచేసాడని పురాణం చెబుతోంది.

వరలక్ష్మి వ్రత కథ

చారుమతిదేవి అని ఒక బ్రాహ్మణ స్త్రీ పూర్వము మగధ దేశములో నివాసముండేది. ఆమె ఎంతో భక్తి శ్రద్దలతో తన భర్తను ప్రేమిస్తుండేది. పతియే ప్రత్యక్ష దేవునిగా భవిస్తూ, పెద్దలకు గౌరవమిస్తూ ఉండేది. ఎటువంటి బేధము లేకుండా అందరిని ఆప్యాయంగా మాట్లాడుతుండేది. ఆ మహా పతివ్రతము చూసి వరలక్ష్మి దేవి ముచ్చటపడి అనుగ్రహించింది.

ఒక రాత్రి ఆ ఉత్తమ స్త్రీ నిద్రపోతుండగా వరలక్ష్మి దేవి కలలో కనపడి శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది. చారుమతీదేవి ఎంతో సంతోషించి ఈ విషయం తన భర్తకి, అత్తమామలకు తెలియ చేయగా వారు కూడా సంతోషించారు. తరువాత తాను ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పింది. అందరు శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడ సాగరు. వారు ఎంతగానో వేచి చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. పొద్దు పొడవక ముందే లేచి, స్నానం ఆచరించి, పట్టు వస్త్రాలు ధరించి అందరు చారుమతి ఇంట్లో వ్రతం చేయడం ఆరంభించారు. తరువాత అందరి కోరికలు వరలక్ష్మి దేవి తీర్చడంతో ఈ రోజున ప్రతి ఏటా వ్రతం చేయడం మొదలుపెట్టారు.

వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి?

అష్ట లక్ష్మి దేవతల్లో వర లక్ష్మికి ప్రత్యేకమైన స్థానం ఉందని అంటారు. అందుకే ఆమెను విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణమాసంలో పూజిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రతీతి. అంతే కాకుండా నిత్య సుమంగళిగా ఉండాలని పవిత్ర స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon