Link copied!
Sign in / Sign up
11
Shares

వంటరిగా ఉన్న మహిళలు పిల్లలను పెంచడం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు


పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో తలిదండ్రుల బాధ్యత గురుతరమైంది. పిల్లల పెంపకంలో భార్యాభర్తలిద్దరూ బాధ్యతను పంచుకుంటే కొంతవరకు సులభమవుతుంది. కానీ అన్ని కుటుంబాల్లో కానీ, ప్రతివారి విషయంలో కానీ పరిస్థితి ఒకేలా ఉండదు. భార్యభర్తల్లో ఎవరో ఒకరు మరణించినా, లేక ఏదోక కారణం వల్ల దూరమైనా బాధ్యత అంతా ఒకరిమీదే పడుతుంది. తమ పిల్లల్ని ఒక్కరే అంటే తల్లి కానీ, తండ్రి కానీ ఒంటరిగానే చూసుకోవాల్సి వస్తుంది. దీన్నే సింగిల్ పేరెంటింగ్ అంటారు.

పిల్లల పెంపకం సులభమేం కాదు. కానీ కొన్ని సలహాలు పాటిస్తే సులభతరం చేసుకోవచ్చు.

1. పొదుపు పాటించాలి

 పిల్లల్ని పెంచడం చాలా ఖర్చుతో కూడుకున్నది. భవిష్యత్తులో ఊహించని ఖర్చులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా కాలేజీ చదువుకు చాలా ఎక్కువే వ్యవయమవుతుంది. కాబట్టి ముందు నుంచే డబ్బు దాచుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. రోజువారీ ఖర్చుల జాబితా రాసుకొని, అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి. అంతగా అవసరమైతే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం అవసరమైన డిగ్రీ తెచ్చుకోవాలి. ఇదంతా మొదట్లో శ్రమ అనిపించినా, తర్వాత ప్రయోజనం ఉంటుంది.

2. మొహమాటం వద్దు

 మీ పరిస్థితి ఏమిటో ఆఫీసులో మీ బాస్ కు చెప్పడానికి సిగ్గు పడకండి. ఇదేదో సానుభూతి సంపాదించే ప్లాన్ అని కానీ, మిమ్మల్ని తక్కువ చేసుకోవడం అని కానీ అనుకోవద్దు. మీ బాస్ మీకు అండగా ఉంటే తప్పకుండా అది మీకు మేలే అవుతుంది. లైఫ్ కూడా సాఫీగా సాగిపోతుంది. మీ శ్రమ తగ్గుతుంది. మీరు మీ పనుల్ని తేలిగ్గా చేసుకోగలగడమే కాక, పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశముంటుంది.

3. పిల్లలతో నిజాయితీగా ఉండాలి

 పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్లకూ కుటుంబ విషయాలు తెలుస్తాయి. నాన్న గురించి కానీ, అమ్మ గురించి కానీ రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. వాళ్లు అడిగిన వాటికి నిజాయితీగా నిజాలే చెప్పాలి కానీ ఏదీ దాచకండి. తల్లి లేదా తండ్రి సంరక్షణలో పెరిగే పిల్లల మనసుల్లో వారు పెరుగుతున్న వాతావరణం కారణంగా పెద్దవాళ్లందరి పట్ల వ్యతిరేక భావాలు కలగవచ్చు. మీ పిల్లల మనసుల్లో అలాంటి భావాలు రానీకూడదు. అందరూ ఒకేలా ఉండరని, పరిస్థితుల వల్ల ఒక్కోరూ ఒక్కో విధంగా మారుతారని చెప్పాలి.

4. కలుపుగోలుతనం 

 మరొక జీవిత భాగస్వామిని వెతుక్కోవడం కన్నా మీ పిల్లలతో సాధ్యమైనంతవరకూ కలుపుగోలుగా ఉండేందుకు ప్రయత్నించాలి. అయితే మీరు లైఫంతా మీ పిల్లలమీదే ఆధారపడి ఉన్నట్టు కూడా అనిపించకూడదు. దాన్ని మీ బలహీనతగా వాళ్లను కుంటారు. అలాగే --వారి భావోద్వేగాలు వారికుంటాయి. వాటి నుంచి వాళ్లు తప్పించుకోలేరు. కాబట్టి మీకోసమని వాళ్లను ఒత్తిడి చేయకూడదు. మీరంటే వాళ్లు చికాకు పడకూడదు.

5. తప్పు మీమీద వేసుకోవద్దు

కుటుంబాన్ని లెక్క చేయకుండా కొందరు భార్యాభర్తలు అభిప్రాయ భేదాలవల్ల విడాకులు తీసుకునే పరిస్థితి కలగవచ్చు. లేదా సింగిల్ పేరెంట్ గా మిగిలిపోవచ్చు. అలాంటప్పుడు ఏదో తప్పు చేశామని అనుకోవద్దు. భార్యాభర్తలు నిత్యం కొట్లాడుకునే వాతావరణంలో కన్నా, తలిదండ్రుల్లో ఎవరోకరి పెంపకంలోనే మీ పిల్లల్ని బాగా పెంచే వీలుంది. మీ పిల్లల మాదిరే మీకూ సంతోషం కావాలి కదా. పిల్లలకు ఏదీ చేయలేకపోయానే అనుకోవద్దు. మీ శక్తికి తగ్గట్టు చేయండి. పిల్లలు కూడా గుర్తిస్తారు.

6. సానుకూల వైఖరి 

 మీకు ఏది సంతోషమనిపిస్తే అది చేయండి. ఒక్కోసారి మీరు ఒంటరిగా ఉండాలని కోరుకున్నా తప్పు లేదు. మీరు సంతోషంగా ఉంటే మీ పిల్లలూ సంతోషంగా ఉంటారు. అలాగే... మీ పిల్లలపట్ల సానుకూలంగా ఉండండి.


Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon