Link copied!
Sign in / Sign up
9
Shares

వక్షోజాల సైజు సహజంగా పెరగాలంటే చేయాల్సిన 3 మసాజస్

వక్షోజాలు స్త్రీ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. అవి పోషించే పాత్ర కూడా పెద్దదే. బిడ్డకు పాలు ఇవ్వడానికి, మీ అందంగా కనపడడానికి,  అంతే కాకుండా శృంగార సమయంలో వక్షోజాలు భవప్రాప్తి కలిగించడంలో, కూడా కొంత తోడ్పడుతాయి. అయితే మీ వక్షోజాలు  అందంగా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని మెసేజులు అవసరం అవేంటో, వాటి ఉపయోగాలేంటో, ఎలా చేయాలో చూడండి…

బ్రెస్ట్ మసాజ్ యొక్క ఉపయోగాలు

1. బ్రెస్ట్ మసాజ్ చేయడం వలన, మీ వక్షోజాల నాళ వ్యవస్థ లోని టాక్సిన్స్ ను తొలిగించి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని  తగ్గిస్తుంది. 

2. మీ వక్షోజాలకు సరైన రూపాన్ని ఇచ్చి బిగువుగా చేస్తాయి.

3. మీ బ్రెస్ట్ కణజాలం ఆరోగ్యంగా ఉండడానికి, మీ రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.

4. వక్షోజాల పై మచ్చలను తగ్గిస్తుంది.

బెస్ట్ మసాజ్ చేయాల్సిన విధానాలు:

R breast - కుడి రొమ్ము

L breast - ఎడమ రొమ్ము

RH(Right Hand) - కుడి చెయ్యి

LH(Left Hand) - ఎడమ చెయ్యి

1. లిఫ్ట్ అండ్ షేప్ మోషన్ (lift and shape motion)

మీ కుడివైపు రొమ్ము నిప్పుల్ మీద మీ ఎడమ చేయిని ఉంచి, కుడి చేతితో రొమ్మును చుట్టూ మెల్లగా ఒత్తుతూ మసాజ్ చేయండి. ఇలాగే ఎడమ వైపు రొమ్ము నిప్పుల్ మీద కుడి చేయిని ఉంచి, ఎడమ చేతితో రొమ్మును మస్సాజ్ చేసుకోండి.

2. స్విర్లింగ్ మోషన్ (Swirling motion)

కుడి వైపు రొమ్ముమీద కుడి చేతి రెండు వేళ్ళను ఉంచి, వేళ్ళను తిప్పుతూ రొమ్ము చుట్టూ మసాజ్ చేయండి. అలాగే ఎడమ వైపు రొమ్ము కూడా చేయండి.

3. రోలింగ్ మోషన్ (Rolling motion)

కుడి వైపు రొమ్ము పై భాగంలో కుడి చేతిని ఉంచి, కింద భాగంలో ఎడమ చేతిని ఉంచి, ముందుకు వెనక్కు తిప్పుతూ మసాజ్ చేయండి. అలాగే ఎడమ రొమ్ము కు కూడా అలానే చేయండి.

4. పంపింగ్ మోషన్ (Pumping motion)

కుడి రొమ్ము కింద భాగంలో కుడి చేయిని ఉంచి వత్తాలి, వెంటనే ఎడమ చేయిని ఉంచి వత్తాలి. అలాగే ఎడమ రొమ్ము కింద భాగంలో ఎడమ చేయిని ఉంచి వత్తుతు, వెంటనే కుడి చేతితో కూడా చేయండి.

ఈ బ్రెస్ట్ మసాజ్ లు మీరు తరుచు చేయడం వలన మీ రొమ్ము సైజు పెరగడమే కాకుండా, సరైన ఆకృతిలో అందంగా,  ఆరోగ్యంగా ఉంటాయి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon