Link copied!
Sign in / Sign up
4
Shares

వక్షోజాల (బ్రెస్ట్) సైజును తగ్గించుకోవడానికి 6 సహజ మార్గాలు

మహిళలు సహజంగానే అందంగా ఉంటారు అనే విషయంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఐతే వయస్సు పెరిగే కొద్దీ, పిల్లలకు జన్మనిచ్చి తల్లి అయిన తర్వాత, అధిక బరువు పెరిగినప్పుడు, శరీరంలోని హార్మోన్ల మార్పు కారణంగా, కొందరిలో వంశపారపర్యంగా తమని మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంచే వక్షోజాలు ఉన్నట్లుండి పెద్దవిగా పెరగటం కాస్త ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ చిట్కాల ద్వారా బ్రెస్ట్ సైజును సహజంగానే తగ్గించుకోవచ్చు.

అల్లం టీ, తేనె

వక్షోజాలు పెద్దవిగా కావడానికి కారణాలలో బ్రెస్ట్ భాగంలో చేరుకున్న అధిక కొవ్వు మరియు ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు అధికంగా ఉండటం. బ్రెస్ట్ సైజును మరియు శరీరంలోని అనవసరపు కొవ్వును తగ్గించడంలో అల్లం కీలకపాత్ర పోషిస్తుంది. అల్లంను రోజూ డైరెక్ట్ గా లేదా అల్లంను కొంచెం తరిగి గోరు వెచ్చని నీటిలో కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు సేవించడం వలన రొమ్ముల అధిక పరిమాణం తగ్గుతుంది.

అవిసె గింజలు

బ్రెస్ట్ సైజు పెరగడానికి కారణాలలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ కూడా కారణమని చెప్పుకున్నాం కాబట్టి, అవిసె గింజలను తీసుకోవడం వలన రొమ్ముల సైజును తగ్గించుకుని అందంగా మార్చుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ నీటిలో కొన్ని అవిసె గింజలు కలిపి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ నీటిని వడగట్టుకుని సేవించడం వలన బ్రెస్ట్ సైజును తగ్గించుకోవచ్చు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా అధికంగా ఉండటం వలన బ్రెస్ట్ సైజును తగ్గిస్తాయి. టూనా ఫిష్ మరియు సాల్మన్ ఫిష్ కూడా బ్రెస్ట్ సైజును తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ఈ వ్యాయామాలు చేయాలి

తరచూ ఎక్సర్ సైజెస్ చేయడం వలన శరీరంలో కొవ్వు శాతం ఏర్పడటమే కాకుండా బ్రెస్ట్ సైజు పెరగకుండా చేస్తుంది. ఐతే పిల్లలు పుట్టాక, అధిక బరువు పెరిగిన తర్వాత బ్రెస్ట్ సైజు పెరిగినట్లయితే కార్డియో, ఏరోబిక్స్, పుష్ అప్స్ ఎక్సర్ సైజెస్ చేయడం వలన మజిల్స్ ను బలంగా ఉంచి, ఎద భాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వును దూరం చేస్తుంది. ఈ వ్యాయామాలు మొదలుపెట్టినప్పుడు ఒకేసారి గంటల తరబడి చేయకుండా నెమ్మదిగా కొన్ని నిముషాలు చేసి విశ్రాంతి తీసుకోవాలి. రోజులు గడిచేకొద్దీ సమయం పెంచుకోవాలి.

ఎగ్ వైట్

రెండు గుడ్లను తీసుకుని, వీటిని పగులగొట్టి ఇందులో నుండి ఎగ్ వైట్స్ ఒక బౌల్ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెస్ట్ భాగంలో మర్దనాలా చేసుకుంటూ మాస్క్ లా వేసుకోవాలి. 25 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి 2 సార్లు ఇలా చేయడం వలన బ్రెస్ట్ సైజు తగ్గుతుంది. ఇంకో విధంగా ఎగ్ వైట్ లో కాస్త ఆనియన్ జ్యూస్ కలిపి మాస్క్ లా వేసుకుని శుభ్రం చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.

డైట్

శరీరంలోని ప్రతి భాగంలో ఏర్పడే కొవ్వును ఎక్కువ శాతం తీసుకునే ఆహారమే కారణం మరియు సరిగ్గా పాటించని డైట్ కూడా. బ్రెస్ట్ సైజు తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు గ్రీన్ వెజిటేబుల్స్, తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, సముద్రచేపలు తీసుకోవడం వలన బ్రెస్ట్ పరిమాణాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

డ్రస్

మహిళలు ధరించే దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ బిగుతైన దుస్తులు ధరించడం, వదులుగా ఉండే దుస్తులు ధరించడం వలన వక్షోజాలపై ప్రభావం చూపుతుంది కాబట్టి, మీ శరీరానికి కంఫర్ట్ గా ఉండే విధంగా డ్రెస్ లను వేసుకోవాలి. ఆ,,దుస్తులలో ఏముందిలే అనుకుంటే చాలా పొరపాటు. అలాగే లో దుస్తులుగా ధరించే బ్రా కూడా బిగుతుగా ఉండటం మంచిది కాదు.

ఈ విషయాలు మహిళలు అందరికీ తెలిసేలా SHARE చేయగలరు.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon