Link copied!
Sign in / Sign up
16
Shares

వక్షోజాల నుండి కారుతున్న పాలను ఆపడానికి 4 సులువైన చిట్కాలు

మీరు అమ్మ అయిన తరువాత మీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.  మీరు మీ బిడ్డకు పాలు ఇవ్వడం అందులో ఒకటి. తప్పకుండా మీ బిడ్డకు 6 నెలలు నిండే వరకు పాలు ఇవ్వాలి. ఆ తరువాత కూడా అవసరాన్ని బట్టి ఇవ్వచ్చు. ఏదేమైనా కొంతకాలానికి మీరు పాలు ఇవ్వడం ఆపేస్తారు.  అయినా కూడా మీ వక్షోజాల నుండి పాలు కారుతూనే ఉంటాయి. అలాంటి సందర్భాలలో పాలను ఆపడం చాలా అవసరం లేకపోతే అది ఇన్ఫెక్షన్లకు దారి తీయచ్చు. వక్షోజాల నుండి కారే పాలను ఎలా ఆపాలో ఇక్కడ తెలుసుకోండి…

1. బర్త్ కంట్రోల్ పిల్స్

ఇంతక ముందు ఓస్ట్రోజెన్ అధికంగా ఉండే టాబ్లెట్స్ ను వాడడం వలన వక్షోజాల నుండి  పాలు కారడం ఆగిపోయేది. కానీ వాటిని వాడడం అంత మంచిది కాదు. అవి సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీయచ్చు. వాటికి బదులుగా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం మంచిది. అవి వక్షోజాల నుండి వచ్చే పాలను ఆపుతాయి.

2. ఫ్రీగా వదిలేయండి

చాలా మంది పాలు కారడం ఆపడానికి వక్షోజాలు బిగుతుగా ఉండేలా బిగువైన బ్రాలను ధరిస్తారు. ఇది అంత మంచి పద్దతి కాదు. దీని వలన వక్షోజాల మీద అధిక వత్తిడి పడి, పాలు ఇంకా ఎక్కువ కారే అవకాశం ఉంటుంది.

3. నీరు తగ్గించకండి

నీరు లేదా వివిధ రకాల ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వక్షోజాలలో పాల ఉత్పత్తిని పెంచుతుంది అని చాలా మంది నమ్ముతారు. అలాగే ద్రవాలను తీసుకోవడం తగ్గిస్తే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. మీరు వక్షోజాలలో పాలు కారడాన్ని ఆపడానికి నీరు తగ్గిస్తే అది అనేక ఇతర సమస్యలకు దారి తీయచ్చు. మీరు సాధారణంగా తీసుకునే నీరును రోజు తీసుకోండి.

4. దర్భ (sage)

ఇది ఒక చెట్టు, చూడడానికి పుదీనా లానే ఉంటుంది. దీనిని మీరు రోజు, నేరుగా తినడమో లేదా టీ ద్వారా తీసుకోవడమో చేయడం వలన, మీ వక్షోజాల నుండి పాలు కారడం ఆగుతుంది. ఇందులో అధికంగా వుండే ఓస్ట్రోజెన్ పాలు కారడాన్ని తగ్గిస్తుంది.

5. క్యాబేజి ఆకులు

శుభ్రంగా కడిగి, ఫ్రిడ్జ్ లో ఉంచిన క్యాబేజీ ఆకులను మీ వక్షోజాల పై ఉంచడం పాలు కారడాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ వక్షోజాల నుండి పాలు కారడాన్ని తగ్గించడమే కాకుండా, వాపును నొప్పిని తగ్గిస్తుంది.

6. పాలను పిండడం

మీ వక్షోజాలలో నుండి బయటకు వస్తున్న పాలను బట్టి, పాల ఉత్పత్తి ఆధారపడివుంటుంది. మీరు అప్పుడప్పుడు మీ వక్షోజాలు పాలతో నిండిపోయినప్పుడు వాటిని బయటకు వత్తేయండి. మీ వక్షోజాలలో పాల ఉత్పత్తి తగ్గుతుంది.

7. ఐస్ ప్యాక్స్

ఐస్ గడ్డలను వక్షోజాల పై ఉంచుకోవడం, పాలు కారడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా వక్షోజాలలో నొప్పిని, మంటను వాపును కూడా తగ్గిస్తుంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon