Link copied!
Sign in / Sign up
3
Shares

మీ వక్షోజాల గురించి అందరూ చెప్పే ఈ 3 విషయాలు నమ్మకండి : డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు

సుమారుగా సగం పైగా మహిళలకు తమ వక్షోజాల గురించి పూర్తిగా తెలియదు అంటే,  అందరూ ఒప్పుకుంటారు. నిజానికి మీ స్నేహితులు, అక్కలు, బంధువులు అందరూ మీకు వక్షోజాల గురించి చెప్పేవాటిలో కూని మాత్రమే నిజాలు. మీ వక్షోజాల గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. తెలియాల్సింది చాలా ఎక్కువ. వాటిలో కొన్ని ఇక్కడ చూడండి..

1. వక్షోజాల సైజు అలానే ఉంటుంది

చాలా మంది స్త్రీలు తమ వక్షోజాలు జీవితాంతం ఒకే సైజు లో ఉంటాయని అనుకుంటారు కానీ అది నిజం కాదు. వక్షోజాలు సైజు మారుతూవుంటుంది.  మీ బరువుతో సంబంధం లేకుండా మీలో జరిగే హార్మోన్ల మార్పులు కూడా మీ వక్షోజాల సైజు మీద ప్రభావం చూపిస్తాయి.

2. పెద్ద వక్షోజాలలో ఎక్కువ పాలు ఉంటాయి

మీరు తల్లి అయ్యాక మీ వక్షోజాలలో పాల గురించి మీకు కొంత ఆలోచన ఉంటుంది. అందరూ అనుకునేటట్టు వక్షోజాల సైజును బట్టి కాకుండా వక్షోజాలలోని పాలు మీ శరీరంలో జరిగే లాక్టాషన్ బట్టి ఉత్పత్తి అవుతాయి.

3. బిడ్డకు పాలు వక్షోజాలు సాగిపోతాయి

బిడ్డకు పాలు ఇవ్వడం వలన మీ వక్షోజాలు సాగడం అనేది జరగదు. అందుకు వేరే కారణాలు ఉండచ్చు. మీరు బిడ్డకు పాలిచ్చేటపుడు మీ వక్షోజాల మీద ఏ ప్రభావం ఉండదు. మీరు ప్రెగ్నన్సీ సమయంలో వక్షోజాల బరువు పెరగడం వలన జారిపోవడం జరగచ్చు.

4. వ్యాయామం వలన సైజు పెరుగుతుంది

వక్షోజాల సైజు పెరగాలి అని చాలా మందికి ఉంటుంది. అందుకు అనేకమైన ఉపాయాలను ఫాలో అవుతుంటారు. అందులో ఒకటి వ్యాయామం చేయడం. వ్యాయామం చేయడం మీ వక్షోజాలకు ఒక ఆకృతిని ఇస్తుంది. కానీ సైజు పెరగదు.

5. జన్యువులు నిర్దేశిస్తాయి

పొడవు, బరువు అలాగే శరీర కొలతలు మీ జన్యువుల మీద ఆధారపడివుంటాయి. అలాగే వక్షోజాల సైజు కూడా జన్యువుల ఆధారంగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు.  కానీ అది నిజం కాదు వ్యక్తులను బట్టి సైజు ఆకృతి వేరుగా ఉంటాయి.     

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon