ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి విశిష్టత గురించి మీకు తెలియని 5 విషయాలు
అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని అంటారు. ఈ రోజు వైష్ణవ ఆలయాలన్నీ భక్తుల దైవ దర్శనంతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఐతే ఎంతో పవిత్రమైన ఈ రోజు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి?
సూర్య భగవానుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి పవిత్రమైనదే కానీ మరీ ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు. అందులో ఈ వైకుంఠ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది.
3 కోట్ల దేవుళ్లతో భక్తుల కొరకు

అత్యంత పవిత్రమైన రోజుగా పిలవబడుతున్న వైకుంఠ ఏకాదశి రోజున హిందూ దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం చేయడం వలన ఎంతో మంచిదని, పాప దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనరూపుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలవడం జరుగుతోంది.
ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యత

3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి భక్తులకు దర్శనభాగ్యం ఇస్తున్న ఈ రోజునే దేవతలు, రాక్షసులు కలిపి జరిపిన క్షీరసాగర మథనంలో అమృతం మరియు హాలాహలం పుట్టగా, పరమశివుడు కాలకూట విషాన్ని తన గొంతులో బంధించుకున్న గొప్ప రోజు. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించింది వైకుంఠ మహాదశి రోజే. అత్యంత పవిత్రమైన ఈ రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం నుండి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
వైకుంఠ ఏకాదశి పూజ ఎలా చేయాలి?
ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని, పూజగదిని పూలతో అలంకరించుకుని పూజకు తామరపువ్వులు మరియు తులసీ దళాలను ఉపయోగించాలి. ఈ రోజున జాజిపూలు తీసుకుని మాలగా అల్లుకుని పూజగదిలో ఉన్న విష్ణుమూర్తి పటానికి అలంకరించి భక్తి శ్రద్దలతో పూజ చేసి తియ్యటి పదార్థాలను నైవేద్యంగా ఉంచాలి. అలాగే అత్యంత పవిత్రమైన ఈ రోజున ఉపవాసం ఉండటం ఎంతో మంచిదని, అపద్ధాలు చెప్పకూడదు, ఇతరులపై అభాండాలు వేయకూడదు, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది.
ముక్కోటి ఏకాదశి పురాణం

కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, ఋషులను,, సాధువులను హింసిస్తూ ఉండేవాడట. ఆ రాక్షసుడి బారి నుండి రక్షించాలని అందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకోవడం జరిగింది. విష్ణువు రాక్షసుడిని వధించేందుకు బయలుదేరగా ఈ విషయం తెలుసుకున్న ముర సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. ఈ రాక్షసుడిని బయటకు రంపించేందుకు బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లు నటిస్తాడు. ఈ ఇదే అదునుగా భావించి శ్రీ విష్ణువును వధించడానికి సాగర గర్భం నుండి రాక్షసుడు బయటకు వస్తాడు. ఈ సమయంలో మహావిష్ణువు నుండి ఓ శక్తి ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఇలా దేవతలను, ఋషులను సంరక్షించిన రోజును ఏకాదశి అని పిలుస్తున్నారు.
ఈ విషయాలను అందరితో SHARE చేసుకోండి…
