Link copied!
Sign in / Sign up
1
Shares

ఉల్లిపాయలను ఒక్కసారి కోసిన తర్వాత మళ్ళీ వాడవచ్చా..! ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..

ఉల్లిపాయను మనం దాదాపు ప్రతి ఒక్క కూరలోనూ ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన సామెతలలో కూడా ఉంది. ఇదిలా ఉంచితే ఉల్లిపాయలు ఎంత ఘాటుగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉల్లిపాయను కట్ చేసేటప్పుడు మన కంట్లో వచ్చే కన్నీరే ఇందుకు సాక్ష్యం. కాగా ఉల్లిపాయలో ఉండే ఘాటైన వాసన కారణంగా ఇందులోకి త్వరగా సూక్ష్మక్రిములు, బాక్టీరియా చేరి విషంగా మారుతాయట కదా అని మన వెబ్ సైట్ ను ఎప్పుడు ఫాలో అయ్యే ఒక్కరు అడిగారు. నిజంగా కట్ చేసిన ఉల్లిపాయను నిల్వ ఉంచి మళ్ళీ వాడకూడదా..! అని అడిగారు. అసలు నిజం ఏంటో ఇక్కడ తెలుసుకోండి..

ఉల్లిపాయ కట్ చేశాక విషంగా మారుతుందా..!

ఒక్కసారి ఉల్లిపాయను కట్ చేసి నిల్వ ఉంచితే అది విషంగా మారుతుందా..! అని మీతోపాటు చాలామందికి ఉన్న అనుమానం. ఉల్లిపాయతో ఉండే ఘాటైన వాసన కారణంగా సూక్ష్మక్రిములు, బాక్టీరియా త్వరగా వ్యాప్తి చెందుతాయని, వీటిని మళ్ళీ ఉపయీగించడం వలన విషంగా మారి కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఒక పుకారు సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ లలో హల్చల్ చేస్తోంది. అయితే అసలు నిజం ఏంటో డాక్టర్లు ఏం చెప్పారంటే.. ఉల్లిపాయను ఒక్కసారి కట్ చేసి వాడిన తర్వాత మళ్ళీ ఉపయోగించడం వలన ఎటువంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు.

అసలు నిజం ఇదే..

ఒక్కసారి ఉల్లిపాయను కట్ చేసి మళ్ళీ వాడటం వలన అందులో ఉండే ఘాటైన వాసన కారణంగా ఎటువంటి బాక్టీరియా, సూక్ష్మక్రిములు చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మిగిలిన పండ్లు, కూరగాయలు కూడా ఇలా ఒక్కసారి కట్ చేసి పక్కన ఉంచితే వాటికి కూడా త్వరగా సూక్ష్మక్రిములు మరియు బాక్టీరియా చేరుతాయని అంటున్నారు. అయితే ఉల్లిపాయ విషయం వచ్చేసరికి ఒక్కసారి కట్ చేసుకుని మిగిలిన దానిని పడవేయకుండా మళ్ళీ ఉపయోగించుకోవాలంటే కట్ చేసుకునేటప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం మరియు రిఫ్రిజిరేటర్ లో ఒక ప్లాస్టిక్ లో రెండు లేదా మూడు రోజుల పాటు నిల్వ ఉంచుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అంటున్నారు. ఉల్లిపాయ మాత్రమే కాదు ఇతర వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ విషయంలో కూడా ఈ విధంగా చేయవచ్చు.

మీకు అనుమానం ఉన్నట్లయితే..

ఇలా మీకు ఎంతమంది చెప్పినా కట్ చేసిన ఉల్లిపాయను మళ్ళీ వాడవచ్చా..! వాడకూడదా..! అనే అనుమానం ఇంకా ఉన్నట్లయితే పెద్దపెద్దగా ఉండే ఉల్లిపాయలు కాకుండా చిన్నగా ఉండే ఉల్లిపాయలు తీసుకోవడం చేయాలి. చాలామంది పెద్ద ఉల్లిపాయలను కోసిన తర్వాత పడేయాలంటే మనస్సు ఒప్పదు మరియు మళ్ళీ వాడితే ప్రమాదం అని అనుకుంటూ ఉంటారు. అందుకని చిన్న ఉల్లిపాయలు వాడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon