Link copied!
Sign in / Sign up
52
Shares

ఉదయం లేవగానే రతిక్రీడ చేయడం మంచిదా? ఆశ్చర్యపరిచే నిజాలు

ఉదయం నిద్రలేవగానే శృంగారంలో పాల్గొనటం మంచిదేనా? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. రాత్రిపూట నిద్రతో రిలాక్స్ పొందిన  శరీరానికి శృంగార కోరికలు  కలగడం సహజమే. అయితే ఉదయం శృంగారంలో పాల్గొనటం వలన శరీరానికి ఏం జరుగుతుందో అసలు నిజాలు మీరే చూడండి.

శరీరానికి ఉత్తేజం

ఉదయం నిద్రలేచిన తర్వాత శృంగారంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని, ఇది శరీరాన్ని ఉత్తేజపరచడానికి  బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రక్తపోటు తగ్గిస్తుంది

ప్రాత:కాలం శృంగారం ఎంతో ఆరోగ్యకరమైనదని నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి, ఆందోళన కారణంగా రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడే దంపతులు శృంగారంలో పాల్గొంటే ఈ సమస్యను తగ్గిస్తుంది.

హార్ట్ ఎటాక్

ప్రతిరోజూ కాకపోయినా వారంలో ఒకటి లేదా రెండుసార్లు రతిలో పాల్గొనటం వలన బ్లడ్ ప్రెజర్ తగ్గి, హార్ట్ ఎటాక్ సమస్యలు రాకుండా నివారిస్తుంది.

శరీరంలో జరిగే మార్పులు

ఉదయం పూట రతిలో పాల్గొనటం వలన ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మేని ఛాయను ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.

జలుబు

జలుబు, ఫ్లూ సమస్యలతో బాధపడే దంపతులు ఉదయం రతిక్రీడలో పాల్గొనటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా జలుబు, ఫ్లూ అటాక్ నుండి బయటపడవచ్చు.

బరువు తగ్గుతారు

ఉదయం శృంగారంలో పాల్గొనటం వలన శరీరం నుండి ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. దీనివలన అధిక బరువు ఉన్నవారు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

వ్యాయామంతో సమానం

సమయానికి సరైన ఆహారం తీసుకున్నప్పుడు, వ్యాయామాలు చేసినప్పుడు, సరైన నిద్రను పొందినప్పుడు,  ఆనందంగా ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యకరంగా ఉంటారో ఉదయం సంభోగంలో పాల్గొనటం కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సో, ఇవండీ ఉదయం శృంగారంలో పాల్గొనటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ప్రతి దంపతులకు ఈ ముఖ్యమైన సమాచారం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.   మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon