Link copied!
Sign in / Sign up
57
Shares

ఉదయం ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు అందం + ఆరోగ్యం : తెలుగువాళ్లు మెచ్చిన జ్యూస్

మన చుట్టూ ఉండే విషయాల గురించి మనలో చాలామందికి తెలియకపోవడం, తెలిసినా కూడా ఆ చిట్కాలను ఫాలో కాకపోవడం దురదృష్టకరం.  అటువంటి జ్యూస్ గురించే ఈ రోజు మనం చెప్పుకోబుతున్నాం. అందరికీ అందంతో పాటు ఆరోగ్యం కావాలి. అలా ఎటువంటి ఖర్చు అవసరం లేకుండా మీరు ప్రతిరోజూ  ఈ జ్యూస్ ను సేవించండి. అందాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఆ జ్యుసే నిమ్మరసం. ఉదయాన్నే నిమ్మరసం తేనే కలిపి సేవించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం…

జలుబు, దగ్గు, జ్వరం దూరం

ప్రతి రోజూ ఉదయం నోటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ నిమ్మరసం, కావాలంటే రెండు స్పూన్ల తేనే అందులో కలుపుకుని సేవించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన శరీరానికి త్వరగా బాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ చేరి జలుబు, దగ్గు, జ్వరాలకు కారణమవుతున్నాయి.

కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి

చాలామంది నీటిని తక్కువగా సేవించడం వలన, కాల్షియం స్థాయిలు పెరగటం వలన, మూత్రం వస్తున్న వెళ్లకుండా ఎక్కువసేపు  ఆపుకోవడం వలన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఒక గ్లాస్ నిమ్మరసంలో కాస్త తేనే కలిపి ఈ జ్యూస్ తాగినట్లయితే కిడ్నీ స్టోన్స్ కరగడానికి బాగా ఉపయోగపడుతుంది.

ముడతలు దూరం, చర్మం మెరుస్తుంది

వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు రావటం, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా త్వరగా ముడతలు రాకుండా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే తప్పకుండా ప్రతి రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం సేవించడం చేయాలి. మీ చర్మాన్ని నిత్యం నిగనిగలాడేలా చేయడంలో సహాయపడుతుంది. ఎండకు బయటకు వెళ్ళిరాగానే కొందరి ముఖం నల్లగా మారుతుంది. అటువంటి వారు నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుని క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొవ్వు తగ్గడానికి

శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వు కారణంగా కొందరు లావుగా కనిపిస్తూ ఉంటారు. పదిమందితో తిరగడానికి కూడా ఇబ్బందిపడుతూ ఉంటారు. అందుకని ఒక గ్లాస్ నిమ్మరసంలో తేనే కలిపి సేవిస్తే పొట్ట చుట్టూ నడుం చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

గుండెకు మంచిది

హార్ట్ ఎటాక్ సమస్యలు రాకుండా, గుండె దృఢంగా ఉండటానికి నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో అధికస్థాయిలో ఫాస్ఫరస్ ఉండటమే ఇందుకు కారణం. అందుకే మర్చిపోకుండా ఈ జ్యూస్ సేవించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

వడదెబ్బ నుండి బయటపడటానికి

ఇప్పటికే సూర్యుడు భగభగమంటూ  మండిపోతున్నాడు. కాబట్టి ఎండకు వెళ్లి వచ్చినప్పుడు, వడదెబ్బగా అనిపించినప్పుడు వెంటనే ఒక గ్లాస్ నిమ్మరసంలో కాస్త ఉప్పు కలుపుకుని సేవించడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది.

ఉపయోగకరం అనిపిస్తే అందరికీ SHARE చేయండి…

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon