Link copied!
Sign in / Sign up
32
Shares

తులసి చెట్టు ఇంట్లో పెట్టుకున్నవారు ఈ 5 తప్పులు చేయకూడదు..

తులసి చెట్టు ప్రాముఖ్యత గురించి దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. తులసి ఆకులను పూజ గదిలో, వైద్య పరంగా, ఆయుర్వేదపరంగా, అనారోగ్యం బారిన పడినప్పుడు తులసి ఆకులను తీసుకోమని చెబుతూ ఉంటారు. ఐతే మనలో చాలామంది ఇళ్లలో లేదా ఇంటి పెరటిలో తులసి మొక్క ఉండే ఉంటుంది . కాగా, ఇలా తులసి మొక్కను పెంచుకునేవారు తమకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులు చేయడం వలన ఆ ఇంటిపై లేదా వ్యక్తులపై ప్రభావం ఉంటుందని మన పెద్దలు అంటున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటో మీరే చూడండి. అందరికీ ఈ విషయాలను SHARE చేయండి..

తులసి చెట్టు ఉన్నవారు చేయకూడని తప్పులు..

1.తులసి ఆకులను చీకటి పడ్డ తర్వాత, స్నానం చేయకుండా ఎప్పుడు ముట్టుకోరాదు. అలాగే ఆదివారం, గ్రహణం మరియు ఏకాదశి సమయాలలో ముట్టుకోవడం లేదా తులసి ఆకులను కట్ చేయకూడదు.

2.తులసి ఇంటి ముందు లేదా ఇంటి పెరటిలో ఉన్నవారు ఉదయం స్నానం చేసి గానీ సాయంత్రం సాయం చేసినప్పుడు తప్పకుండా దీపం ఉంచాలి.

3.ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో పెట్టుకోకూడదు.  అలాగే ఎండిపోయిన తులసి ఆకులను ఆ పెరట్లో పూడ్చిపెడితే మంచిదని చెబుతున్నారు. తులసి చెట్టు ఎండిపోయినప్పుడు ఇంట్లో ఉంచుకోవడం, ఎక్కడపడితే అక్కడ పడివేయకుండా బావిలో లేదా నదీ జలాలలో వేయమని చెబుతున్నారు.

4.కొన్ని చెట్ల ఆకులను తెలియకుండా కొందరు కోస్తూ ఉంటారు. కానీ తులసి ఆకులను  అలా చేయడం మంచిది కాదు. కిందపడ్డ తులసి ఆకులను కాళ్లతో తొక్కడం చేయకూడదు. తులసిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

5.ఇంకో విషయం ఏమిటంటే తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలకుండా చప్పిరించామని చెబుతున్నారు. ఎందుకంటే ఇందులోని ఆమ్లం మీ దంతాలకు మంచిదికాదని అంటున్నారు. అందుకని ఒక గ్లాస్ నీటిలో కొన్ని ఆకులను వేసుకుని సేవించడం చేయాలి.

ఇంకా తులసి గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే COMMENT చేయండి. ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE చేయండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon