Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లలు పుట్టాక తల్లులు ఫాలో అవుతున్న 5 అందమైన హెయిర్ స్టైల్స్ : మీరూ ట్రై చేయండి

అమ్మగా ప్రమోషన్ పొందాక.. మహిళలు ఎక్కువ సమయం తమ పిల్లలతోనే గడుపుతూ ఉంటారు. దీంతో తమ మీద దృష్టి పెట్టే అంత సమయం ఉండదు. అందుకే.. తమ జుట్టును కూడా అంతగా పట్టించుకోరు. ఏదో అలా లూజ్ హెయిర్ లేదంటే ఏదో తెలిసిన జడలు వేసేసుకొని నడిపిస్తుంటారు. కాని.. మీ హెయిర్ ను ఎటువంటి కష్టం లేకుండా సింపుల్ స్టయిల్ తో సెట్ చేసుకోవచ్చు. ఇవి కేవలం అమ్మల కోసమనే కాదు.. కొంచెం బిజీబిజీగా గడిపే ఎవ్వరైనా ఈ సింపుల్ టిప్స్ ను పాటించండి. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఐదు హెయిర్ స్టయిల్స్ ఏవో తెలుసుకుందాం పదండి.

ఈజీ చిగ్ నాన్

ఇది చాలా అందమైన హెయిర్ స్టయిల్. ఎటువంటి సంకోచం లేకుండా ఎటువంటి సమయంలోనైనా ఈ హెయిర్ స్టయిల్ ను వేసుకోవచ్చు. ఇంకా మీ వర్క్ ప్లేస్ లో కూడా ఇది మీకు సరిగ్గా నప్పుతుంది. ఈ హెయిర్ స్టయిల్ ను సెట్ చేసుకోవడానికి మీద దగ్గర రెండు బాబీ పిన్స్ ఉంటే చాలు. కాకపోతే అవి క్వాలిటీ పిన్స్ అయి ఉండాలి. లేకపోతే మీ హెయిర్ స్టయిల్ సరిగ్గా నిలబడకపోవచ్చు.

స్లీక్ విక్సెన్ హెయిర్

ఈ హెయిర్ స్టయిల్ మీకు క్లాసిక్ లుక్ ను ఇస్తుంది. అంతే కాదు ఇది ఫార్మల్ గా ఉండడమే కాకుండా నీట్ లుక్ లో మీ హెయిర్ కనిపిస్తుంది. మీ వర్క్ ప్లేస్ కు సరిగ్గా సూట్ అయ్యే హెయిర్ స్టయిల్ ఇది. అయితే.. ఈ హెయిర్ స్టయిల్ సెట్ చేయడానికి మాత్రం కాసింత సమయం పడుతుంది. మిగితా హెయిర్ స్టయిల్స్ లాగానే ఇది మెస్సీ స్టయిల్ లోనే ఉంటుంది.

క్యూట్ ట్వైస్ పాస్డ్ చిగ్ నాన్

ఈ హెయిర్ స్టయిల్ చాలా క్యూట్ గా ఉంటుంది. అంతే కాదు చాలా నీట్ గా దీన్ని సెట్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఉండే మహిళలకు ఇది బాగా నప్పుతుంది. ఇక.. దీన్ని సెట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్.

ది బ్రేడ్ వ్రాప్డ్ పోనీ టెయిల్

పోనీ, జడ మధ్యలో దేన్ని సెట్ చేసుకోవాలో తేల్చుకోలేక పోతున్నారా. కాని.. ఇప్పుడు మీకా సందేహం అవసరం లేదు. ఎందుకంటే.. ఇది పోనీ, జడ.. రెండు కలిపి సెట్ చేసుకునే హెయిర్ స్టయిల్. ఏదైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ఈ స్టయిల్ ను మీరు సెట్ చేసుకోవచ్చు. మీ పిల్లలతో ఎక్కడికైనా వెళ్లినప్పుడు కూడా ఈ స్టయిల్ మీకు సరిగ్గా నప్పుతుంది. స్టయిలిష్ గా చెప్పాలంటే మీ కళ్లు మీ హెయిర్ మధ్యలో ఉంటాయి. 

ది ట్విస్టెడ్ సైడ్ పోనీ

రాత్రిళ్లు ప్రయాణాలు చేసేటప్పుడు ఈ హెయిర్ స్టయిల్ ను సెట్ చేసుకుంటే ఎంతో ఫ్రీగా ఉంటుంది. మీ పిల్లలతో ఎక్కడికైనా వెళ్లినప్పుడు కూడా ఈ హెయిర్ స్టయిల్ ను సెట్ చేసుకోండి. ఈ హెయిర్ స్టయిల్ ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon