Link copied!
Sign in / Sign up
0
Shares

ఆడపిల్లలకు సరిపోయే అప్పటి 10 సాంప్రదాయమైన అందమైన పేర్లు

పిల్లలకు ప్రస్తుత కాలంలో పేరు పెట్టడం అనేది అంత ఈజీ కాదని ఈ పాటికి చాలామంది తల్లితండ్రులకు తెలిసే ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడే తమకు ఆడపిల్ల పుడితే ఏ పేరు పెట్టాలి, అబ్బాయి పుడితే ఏ పేరు పెట్టాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఒకప్పుడు తమకు ఇష్టమైన తాతయ్య లేదా నాన్నగారు గానీ అమ్మ పేరు పెట్టుకోవాలని ఒకప్పుడు అనుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు ట్రెండ్ మారింది కదా, చాలా కొత్తగా తమ పిల్లల పేర్లు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా మళ్ళీ అప్పట్లో మన పెద్దలు పెట్టుకున్న సాంప్రదాయ పేర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇదిగో ఇక్కడ మన పేజ్ లో చాలామంది పేరెంట్స్ ఆడపిల్లల పేర్లు కొన్ని సూచించమని చెప్పగా వారి కోరిక మేరకు 10 సాంప్రదాయమైన ఆడపిల్లల పేర్లు అందిస్తున్నాం... 

1.అక్షిత 

అద్భుతాలు సృష్టించగల అమ్మాయని అర్థం 

2.జ్యోత్స్న 

వెన్నెలలాగా చల్లనైనది, కాంతివంతమైనది 

3.చిన్మయి 

ధైర్యంగా ఉండటం మరియు అవగాహన పెంచడం 

4.దక్ష 

భూదేవితో సమానమైన ఓపిక కలిగిన అమ్మాయి 

5.ఉపాసన 

ఆరాధన, అత్యంత విలువైనది అని అర్థం 

6.గీతిక

అందమైన చిన్నని పాట 

7.ఆద్య 

మొదటి, ప్రథమం అని అర్థం 

8.నైనిక

ప్రతి ఒక్కరినీ తన కంటిరెప్పలా చూసుకుంటుంది 

9.యశస్విని 

దివ్యమైన, విజయవంతమైన 

10.వసుధ 

భూమి, దేవత 

ఇంకా మీకు ఏ అక్షరంతో అయినా అబ్బాయి లేదా ఆడపిల్లల పేర్లు కావాలనుకుంటే వెంటనే కామెంట్ చేయగలరు..

Image Source : aandhracollections.com

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon