Link copied!
Sign in / Sign up
7
Shares

రాత్రి పడుకునేముందు ఒక్కసారి ఇలా చేస్తే చాలు 'పంటి నొప్పి' ఉండదు..

పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు గారపట్టినప్పుడు, దంతాల మధ్య ఇన్ఫెక్షన్స్, ఏదైనా తిన్నపుడు పళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడం వలన పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు. కొందరికి ఐతే అస్సలు నిద్రపట్టకుండా చేస్తుంది కూడా. పంటి నొప్పి సమస్యతో బాధపడేవారు ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వడం వలన తక్షణమే బయటపడవచ్చు.  ఆ చిట్కాలు ఏంటో మీరే చూడండి.

లవంగం

పంటినొప్పి బాధిస్తున్నప్పుడు ఒక చిన్న లవంగం ముక్కను తీసుకుని నొప్పి ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టుకుని నెమ్మదిగా నమలడం వలన లవంగం  నుండి వచ్చే నూనె వలన నొప్పి తగ్గిపోతుంది. అలాగే లవంగం నూనెను కాస్త దూదితో రాసుకుని నొప్పిగా ఉన్న పళ్ళపై పెట్టుకోవడం వలన నొప్పి తగ్గిపోతుంది.

వెల్లుల్లి

దంతాల నొప్పి తగ్గడానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిని నమలడం లేదా వెల్లుల్లిని దంచి దానికి కాస్త ఉప్పును జోడించి పళ్ళు నొప్పిగా ఉన్న ప్రాంతంలో పెట్టుకోవాలి. కొద్దిసేపు ఇలాగే ఉంచుకుని ఆ తర్వాత తీసివేయడం వలన నొప్పి తగ్గుతుంది.

ఉప్పు నీరు

దంతాల నొప్పి రావడానికి కారణాలలో దంతాల మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు కూడా ఒక కారణమనే చెప్పొచ్చు. అందుకని కాస్త గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలుపుకుని పుక్కిలించడం వలన దంతాల మధ్య పేరుకున్న వ్యర్థాలు తొలగిపోయి కాస్త రిలీఫ్ గా ఉంటుంది మరియు నొప్పి కూడా తగ్గుతుంది.

ఉప్పు మిరియాల పొడి

మిరియాల పొడి మరియు ఉప్పును సమాన భాగాలుగా తీసుకుని కాసిన్ని నీటి చుక్కలు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంతాలు మరియు చిగుళ్ల దగ్గర రాసుకుని కొన్ని నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో పుక్కిలించుకోవడం వలన దంతాల ఇన్ఫెక్షన్ మరియు పంటినొప్పి ఉండదు.

ఉల్లిపాయ

అప్పుడే కోసిన ఉల్లిపాయను దంతాల నొప్పిగా ఉన్న చోట బుగ్గన పెట్టుకోవడం వలన ఉల్లిపాయను నమలడం వలన ఉల్లిపాయ నుండి వచ్చే రసం యాంటీబాక్టీరియాగా పనిచేసి దంతాల నొప్పిని తగ్గించివేస్తుంది. లేదా గోధుమ గడ్డి రసాన్ని పుక్కిలించినా కూడా పంటి నొప్పి తగ్గుతుంది. అలాగే కొన్ని నిముషాల పాటు ఐస్ ముక్కను పెట్టుకున్నా కాస్త రిలీఫ్ లభిస్తుంది.

ఇది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి వెంటనే SHARE చేయగలరు. ఇంకా మీకు ఏమైనా విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటే మాకు COMMENT చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon