మన సినిమా హీరోలలో ఉత్తమమైన జంట ఎవరు? ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం. ఎందుకంటే వారు సినిమా రంగంలో ఉంతునప్పటికీ ఎన్నో మంచి పనులు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ వారు ఎవరు?
1. నాగార్జున - అమల

టాలీవుడ్లో దంపతుల గురించి మాట్లాడగానే ఈ తరం వారికి మొదట గుర్తొచ్చేది నాగార్జున అమల జంట. వీరి పరిచయం సినిమాలలో మొదలయ్యి పెళ్లి వరకు పెరిగింది. ఒక వైపు సినిమాలు చేస్తూ ఎన్నో విధాలుగా ప్రజలకు సహాయం చేస్తున్నారు.
2. మహేష్ బాబు - నమ్రత

వీరిది కూడా ప్రేమ వివాహమే. ప్రేమించి పెద్దల ఆశీర్వాదంతో ఒకటయ్యారు. వీరు చూడముచ్చటగా ఈడు జోడు అనే పదానికి నిర్వచనంలా ఉంటారు.
3. అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సరైన జోడి స్నేహ రెడ్డి. స్నేహ రెడ్డిని ఎదో ఫంక్షన్లో అల్లు అర్జున్ చూసి ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. సినిమా కథల ఉంది కదా. ఒక రోజు వీరి నిజ జీవిత కథతో సినిమా వస్తే బాగుంటుంది కదా.
4. రామ్ చరణ్ - ఉపాసన

ఒకరేమో మెగా స్టార్ చిరంజీవి కొడుకు, మరకోరేమో అపోలో వారసురాలు. చిన్నపట్నుండి స్నేహితులు. వారి వయసుతో పాటు ప్రేమ కూడా పెరిగింది చివరికి పెళ్లితో మరింత బల పడింది. ఉపాసన మరియయు రామ్ చరణ్ కలిసి ఎన్నో సామజిక సేవలో పాల్గొంటున్నారు.
5. రాజమౌళి - రమా

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం వీరు. బాహుబలి సినిమాతో తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచిన రాజమౌళి విజయం వెనుక రమా గారి సహాయం ఎంతో ఉందని స్వయంగా రాజమౌళినే చెప్పారు.
