Link copied!
Sign in / Sign up
18
Shares

ఎండా కాలంలో ‘ఏ సి’ లేకుండా ఇంటిని చల్లబరుచుకోడానికి 6 సులువైన అద్భుతమైన చిట్కాలు

ఎండాకాలం మండేకాలం చూస్తుండాగానే వచ్చేసింది. ఎక్కడ చూసినా సూర్యుని భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. ఏదైనా పని మీద అలా బయటకు వెళితే కాసేపటికే ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నాం. బయట ఎండను తప్పించుకుని ఇంటికి వెళ్ళిన అక్కడ మనల్ని వేడి సెగలు పలకరిస్తున్నాయి. ఏ సి ఉన్న వాళ్ళు ఎలానో తప్పించుకుంటున్నారు. కానీ ఏ సి లేని వాళ్ళు ఆ వేడి వలన ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీకోసం ఏ సి లేకుండా ఇంటిని చల్లపరచడానికి కొన్ని చిట్కాలు…

1. కాటన్ ధరించండి

ఎండా కాలంలో మీరు చల్లగా ఉండాలంటే ముందుగా మీరు ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. నైలాన్, సిల్క్, పోలిస్టర్ లాంటి దుస్తులు కాకుండా కాటన్ దుస్తులను ధరించండి. కాటన్ దుస్తులు శరీరానికి గాలిని అందించి చల్ల బరుస్తాయి. ఎండాకాలంలో వదులైన దుస్తులను ధరించండి. బిగుతైన దుస్తులు ధరించడం వలన ఎక్కువ చమట పోస్తుంది. శరీరం వేడిగా ఉంటుంది.

2. దుప్పట్లు ఫ్రిడ్జిలో

రాత్రి మీరు మీ బెడ్ మీద చల్లగా నిద్రపోవడానికి దుప్పట్లను ఫ్రిడ్జ్ లో పెట్టండి. అర్ధం కాలేదా….మీరు రాత్రికి వాడే దుప్పట్లను ఒక కవర్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో రోజంతా ఉంచండి. మీరు రాత్రి నిద్ర పోయే సమయంలో వాటిని బెడ్ మీదకు వాడండి. ఇలా చేయడం వలన మీకు రాత్రి వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.

3. ఫ్యాను గాలి బయటకి

ఎండా కాలం ఫ్యాన్లు ఒక చిన్న ఊరట. కానీ మీరు వాడే టేబుల్ ఫ్యాన్లను ఉపయోగించి ఇంటిని చల్ల పరుచుకోవచ్చు. సహజం టేబుల్ ఫ్యాన్స్ మీ వైపుకు కాకుండా కిటికి వైపు ఉంచండి. అప్పుడు టేబుల్ ఫ్యాన్ వేడి గాలిని బయటకు పంపిస్తుంది. గది చల్ల బడుతుంది.

4. కిందపడుకోండి

వేడి గాలి తేలికగా ఉండడం వలన గది పై భాగంలో చేరుకుంటుంది. చల్లని గాలి కింద భాగంలో వుంటుంది.  అందుకే ఎండాకాలంలో కింద పడుకోవడం వలన మీకు చల్ల గాలి అందుతుంది.

5. లైట్స్ ఆఫ్

మీరు ఇంట్లో వాడే లైట్స్ కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఎండా కాలంలో అసలే వేడిగా ఉంటుంది, ఆ వేడికి ఈ వేడి కాస్త జత అయితే ఇంక తట్టుకోవడం కష్టమే. అందుకే ఎండా కాలంలో పగటి పూట వెళ్తురు ఎలానో ఉంటుంది కాబట్టి లైట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. రాత్రి పూట ఇళ్ళు చల్లగా ఉండాలంటే తక్కువ కాంతిని ఇచ్చే లైట్స్ వాడండి. 

6. వట్టి వేర్లు

ఈ ఎండాకాలంలో వట్టి వేర్లు మార్కెట్ లో దొరుకుతుంటాయి. ఇవి మీ ఇంటిని సహజంగా చల్లబరుస్తాయి. వాటిని కిటికలకు తగిలించి నీరు చల్లుతూ ఉండాలి. కిటికీ నుండి వచ్చే గాలి వాటి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంటిని చల్ల బరుస్తుంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon