Link copied!
Sign in / Sign up
7
Shares

ప్రెగ్నన్సీ తరువాత తమ లైంగిక జీవితం గురించి మాతో పంచుకున్న ఐదుగురు మహిళలు

పిల్లలు పుట్టాక సెక్స్ లో పాల్గొనడం గురించి మహిళలకు చాలా అనుమానాలు, భయాలు ఉండడం సహజం.సెక్స్ కోరికలు కలుగుతాయా? నొప్పిగా ఉంటుందేమో? ఇంతక ముందులా ఆనందాన్ని పొందగలమా? ఎలా ఎన్నో ప్రశ్నలు. ఈ సమస్యలను ఎదురుకొని, వారి అనుభవాల గురించి ఐదుగురు మహిళలు మాతో పంచుకున్న విషయాలు….

1.ముందు దాని గురించి మాట్లాడుకుంటాం

“ సెక్స్ లో పాల్గొనడానికి ముందు, కొన్ని విషయాల గురించి చర్చించుకుంటాం. బాబు నిద్రపోయిన తరువాత ,తనను డిస్టర్బ్ చేయకుండా ఎలా పాల్గొనాలి? లూబ్రికేషన్ వాడాలా వద్దా? ఇలాంటి విషయాల గురించి ముందే మాట్లాడుకుని కొన్ని ప్లాన్స్ వేసుకోవడం వలన మేము సెక్స్ లో సులభంగా, సంతోషంగా పాల్గొనకలుగుతున్నాం”

2.యోని భాగంలో నొప్పిగా ఉన్నపుడు 

“ప్రెగ్నన్సీ తరువాత మొదట్లో సెక్స్ చేస్తున్నప్పుడు యోని భాగంలో చాలా నొప్పిగా ఉండేది. దానికి కారణం యోని పొడిబారిపోవడం. ఈ సమస్య గురించి తెలుసుకున్నాక లూబ్రికేషన్(lubrication) వాడడం మొదలుపెట్టాం. తరువాత నుంచి నొప్పి లేకుండా సెక్స్ ఎంజాయ్ చేస్తున్నాం”

3.బాగా ఉద్రేకానికి గురవుతాం

"నాకు రెండు నెలల వరకు రక్త స్రావం జరుగుతుడేది. అప్పుడు మా వారితో సెక్స్ చేయడానికి కోరిక వున్నా నేను బయపడేదాన్ని. డాక్టర్ ను సంప్రదించి వారి సూచనలతో రక్తస్రావానికి చికిత్స తీసుకున్నాక, సెక్స్ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు చాలా ఉద్రేకంగా సెక్స్ చేస్తున్నాం.

4.ఇంతకముందు కన్నా ఇప్పుడు ఇంకా బావుంది

“ ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు, డెలివరీ తరువాత చాలా రోజుల వరకు సెక్స్ కి దూరంగా ఉన్నాం. ఇన్ని రోజుల ఎడబాటు మాలో కలుసుకోవాలన్న కోరికను తీవ్రంగా పెంచింది. ఇప్పుడు మేము సెక్స్ చేసేటప్పుడు ఇంతక ముందుకన్నా చాలా ఆనందంగా చేస్తున్నాం.”

5.రొమ్ములు రెండు విధాలుగా

 

 

 

“నా రొమ్ములు నా బిడ్డకు పాలు ఇవ్వడానికి, మా వారిని ఉద్రేక పరచడానికి రెండు పనులు చేయడం నన్ను మొదట అయోమయానికి గురిచేసింది. కానీ ఆలోచించాక అర్ధమైంది, అమ్మతనాన్ని, ఆడతనాన్ని రెండిటిని ఒకేసారి ఇవ్వడం మహిళలు మాత్రమే చేయగలరని. ఇప్పుడు మా వారితో సంతోషంగా సెక్స్ చేస్తున్నా”

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon