Link copied!
Sign in / Sign up
44
Shares

పిల్లలకు మందులు వేసేటప్పుడు తెలియకుండానే మీరు చేస్తున్న 5 తప్పులు : ఇలా బిడ్డకు మంచిది కాదు..

పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు టాబ్లెట్స్,టానిక్స్ లాంటి మందులు ఇవ్వడం సహజం.  వాటి వలన ఆరోగ్యం నయమవుతుంది. కానీ మందులు ఇచ్చేటప్పుడు చేసే తప్పులు చాలా ప్రమాదాలకు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.  అందుకే పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు అందరూ చేసే తప్పులు ఏంటో చూద్దాం.

1.తప్పు మందులు ఇవ్వడం

డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు తీసుకున్నాక. పిల్లలకు వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైన తప్పు జరిగి ఉండచ్చు. మందుల షాపులో ఏదైనా తప్పు మందులు ఇచ్చారేమో, లేదా పిల్లల్ల మందులు వేరే మందులతో కలిసిపోయాయేమో లేదా ఎక్స్’పైరీ డేట్ దాటిపోయిందేమో ,ఒకసారి తప్పకుండా చెక్ చేస్కోండి. ఏ తప్పు జరిగినా నష్టపోయేది మన పిల్లలు.

2.అతిగా మందుల వాడడం

కొంతమంది పిల్లలకు సాధారణంగా చేసే జలుబుకు కూడా నాలుగు రకాల టాబ్లెట్స్ , రెండు రకాల టానిక్స్ వాడేస్తుంటారు. ఆలా చేయడం అంత మంచిది కాదు. పిల్లలకు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి చిన్న సమస్యలకు మందులు అతిగా వాడకండి.

3.డాక్టర్ చెప్పినట్టు వెయ్యకపోవడం

ఏ సమయంలో, ఏ మందులు వేయాలి అన్నది డాక్టర్ చెప్పినట్టు మాత్రమే జరగాలి. అలాకాకుండా పిల్లలకు మీకు వీలున్నప్పుడు మందులు వేయకండి. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫాలో అవడం చాల అవసరం.

4.జబ్బు ఒకటి-మందు ఒకటి

జలుబు,దగ్గు,జ్వరం,తలనొప్పి ఇవన్నీ ఉన్నపుడు వాడే మందుని, తలనొప్పి మాత్రమే ఉన్నపుడు వాడకూడదు. ఇలా చేయడం రియాక్షన్స్ కలిగించచ్చు. అందుకే ఏ జబ్బుకు సంబంధించిన మందును ఆ జబ్బు వచిన్నపుడే వాడాలి.

5.ఒకరి మందులు ఇంకొకరికి వాడడం

ఇంట్లో ఇద్దరు పిల్లలున్నపుడు ఒకరికి వాడిన మందులనే ఇంకొకరికి వాడకూడదు. పిల్లల వయసును బట్టి వాడే మందులు, వేయాల్సిన డొసేజ్ మారచ్చు. ఉదాహరణకు 6 సంవత్సరాలు పిల్లల మందులు 2 సంవత్సరాల పిల్లలకు వాడడం ప్రమాదకరం.

6.సొంత వైద్యం

చాలా మంది కొన్ని జబ్బులకు సొంత వైద్యం వాడుతారు. అంటే వాళ్ళకు తెలిసిన ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఇలానే పిల్లల విషయంలో చేయకండి. అది చాలా ప్రమాదం. ఏ సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరకు తప్పకుండా తీసుకెళ్ళండి.

7.డోస్ తప్పుగా వేయడం

పిల్లకు మందులు ఎక్కువ డొసేజ్ లో వేయడం చాలా చాలా ప్రమాదకరం. ఎప్పుడు కూడా చేయకండి. డాక్టర్ చెప్పిన విధంగానే డొసేజ్ వాడండి.

8.స్టోరేజ్

పిల్లలకు వాడే మందులు ఎక్కడంటే  అక్కడ పెట్టకండి. ఎక్కువ వేడి లేదా చలి ఉన్నపుడు మందులు పాడయిపోతాయి. కొన్ని మందులు రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి, కొన్ని కూల్ టెంపరేచర్ లో ఉండాలి. ఆలా ఏ మందులు ఎలాంటి ప్రదేశంలో ఉండాలో అక్కడే ఉంచండి. ఏదైనా ర్యాక్ లో చక్కగా అమర్చుకోండి.

ఇవి కూడా చదవండి 

చిన్నపిల్లల్లో జుట్టు ఆరోగ్యాంగా పెరగడానికి కొన్ని చిట్కాలు

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon