Link copied!
Sign in / Sign up
7
Shares

తల్లితండ్రులు పిల్లల విషయంలో తమకు తెలియకుండానే చేస్తున్న 5 పెద్ద తప్పులు..

అమ్మనాన్న.. వీళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవారు, వీరు లేనిదే పిల్లలకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు, ఏది ఎలా నేర్చుకోవాలో, ఎలా ఉండాలో, ఇతరులతో ఆప్యాయంగా ఎలా కలిసిపోవాలో తెలియదు. అయితే కొందరు తల్లితండ్రులు తమ పిల్లల విషయంలో తమకు తెలియకుండానే కొన్ని సాధారణ తప్పులు చేస్తున్నారు. అవి అప్పటికీ సాధారణంగానే అనిపించినా పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నకొద్దీ వారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంతకీ ఆ తప్పులేంటి, పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలో ఇక్కడ చూడండి..

పట్టించుకోకుండా వదిలేయటం

ప్రస్తుతం ప్రతి ఒక్కరి లైఫ్ చాలా బిజీబిజీగా గజిబిజిగా నడుస్తోంది. ఏం చేసినా కుటుంబం, పిల్లల కోసం అని అంటుంటారు. అది వందకు వంద శాతం నిజమే కానీ, పిల్లలు ఏదైనా అమ్మనాన్నలతో చెప్పినప్పుడు హా..వీళ్ళు ఏదో చెబుతున్నారులే అని పట్టించుకోకుండా వదిలివేయకూడదు. వాళ్లకు ఏదైనా కొత్తగా, గమ్మత్తుగా అనిపిస్తేనే మీతో చెబుతుంటారు. అలాంటప్పుడు వినకుండా వదిలేస్తే చాలా బాధపడతారు. మీపై ఇష్టం, గౌరవాన్ని కూడా తగ్గిస్తుంది.

అర్థం చేసుకోకపోవడం

ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలకు గొప్ప భవిష్యత్ ఇవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు. అలా గొప్ప జీవితాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో పిల్లలకు ఏం కావాలి? ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు..! అని ఆలోచించకుండా అర్థం చేసుకోవడంలో సతమతమవుతున్నారు. కాబట్టి, ముందు జనరేషన్ ఎలా ఉన్నా, ఈ జనరేషన్ పిల్లలను వారి ఆలోచనలకు తగ్గట్లుగా స్వేచ్ఛను ఇవ్వాలి.

పిల్లలముందు

అందరూ అని కాదు గానీ కొందరు పిల్లలముందు చేయకూడని పనులు, మాట్లాడకూడని మాటలు, చెప్పకూడని విషయాలను మాట్లాడుతూ ఉంటారు. ఇది పిల్లల ఆలోచనలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు తల్లితండ్రులు తమ ముందు చేసే ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. సో, మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట, వీరు ప్రవర్తించే విధానం ప్రతి ఒక్కటీ వాళ్ళముందు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి.

స్కూల్

ప్రస్తుత పిల్లలను చాలా ఇబ్బందిపడుతున్న విషయం స్కూల్. అంటే స్కూల్ కు వెళ్లడం కాదు, అక్కడ వాతావరణం ఎలా ఉంది, మీ పిల్లలు ప్రతి ఒక్కరితో కలిసిపోతున్నారా లేదా, ఒంటరిగా ఉంటున్నారా, ఏదైనా సబ్జెక్టులో ఇబ్బంది పడుతున్నారా, టీచర్ భయంతో స్కూల్ కు వెళ్లడం మానివేస్తున్నారా..ఇలా వారి స్కూల్ లైఫ్ కు సంబంధించి ప్రతి ఒక్కటీ చాలా కేరింగ్ గా తీసుకోవాలి. ఇదే పిల్లలకు మొదటి బయట ప్రపంచం..

ఈ అద్భుతాలు మిస్ చేయకండి

బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. అది ఎంతో అందంగా,  ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత తల్లితండ్రులది. పిల్లలకు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త ప్రదేశాలు వెళ్లాలనే ఆలోచన బాగా ఉంటుంది. ఎక్కడికైనా వెళితే చాలా గొప్పగా ఫీలవుతారు. వారాంతంలో సినిమా, జూ పార్క్, బంధువుల ఇంటికి, బీచ్, షాపింగ్, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు.. ఇలా ఎక్కడికో ఒక చోటుకు తీసుకువెళ్లడం చేస్తూ ఉండాలి. ఈ ఆనందాలను వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు..

తల్లితండ్రులుగా మీ పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే కొన్ని గొప్ప గొప్ప విలువలు, గౌరవం మరియు ఆనందాలే..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon