Link copied!
Sign in / Sign up
1
Shares

తల్లి పాలు తాగి మరణించిన పాప : తల్లి పాలే విషమయ్యాయి!!


బిడ్డకు తల్లి పాలు అమృతంతో సమానం. కానీ ఆ అమృతమే విషమై ఒక బిడ్డ ప్రాణం తీసింది. ఎవరికైనా కన్నీళ్ళు తెప్పించే ఈ దుర్ఘటన తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఎలా జరిగిందో ఇక్కడ తెలుసుకోండి…

అసలేం జరిగింది?

రంగారెడ్డి జిల్లా, ఇర్విన్ గ్రామంలో మల్లయ్య, లక్ష్మిదేవి దంపతులు నివసిస్తున్నారు, వీరికి మూడేళ్ళ కూతురు ప్రణీత ఉంది. తాగుడుకు బానిసయ్యి కుటుంబ కలహాల వలన మల్లయ్య పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. భర్తను ఆపే ప్రయత్నంలో పురుగుమందు లక్ష్మి దేవి చాతి మీద పడింది. భర్త ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకుని హాస్పిటల్ కు తీసుకువెళ్తున్న సమయంలో పాప ఆకలితో ఏడుస్తువుండగా. దీనితో బిడ్డకు ఏమి ఆలోచించకుండా పాలు పట్టించింది. తన చాతి మీద ఉన్న పురుగుల మందు, పాల ద్వారా పాప శరీరంలోకి వెళ్ళి, పాప అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్ వైద్యం చేస్తుండగా బుధవారం పాప మరణించింది.

ఈ దురదృష్టకర సంఘటన అందరి హృదయాలను కాల్చివేస్తుంది. తను ఆలోచించకుండా చేసిన చిన్న తప్పు తన బిడ్డను తనకు దూరంచేసిందని, తన బిడ్డను తానే చేతులారా చంపుకున్నాని ఆ తల్లి తల్లడిల్లిపోతుంది.

పిల్లలకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలో తెలియచేయడానికి, ఈ దుర్ఘటనే ఒక హెచ్చరిక…

అందరికి SHARE చేయండి…   

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon