Link copied!
Sign in / Sign up
5
Shares

తల్లిగా ఉండటం ఎంత కష్టమో ఈ తల్లులను అడిగితే తెలుస్తుంది…!

తల్లిగా మారటం అంటే అది మరో జన్మ. పిల్లలకు జన్మనిచ్చి మహిళలు మరో జన్మ ఎత్తుతారు. అందుకే.. పిల్లలను కనడమంటే ఆ మహిళలు ఎంతో పుణ్యం చేసుకొని, ఎంతో అదృష్టవంతులై ఉండాలి. పిల్లలను కనడం ఎంత కష్టమో.. వాళ్లను పెంచి పోషించడం అంతకన్నా ఎక్కువ కష్టం.

చాలామంది మహిళలు పెళ్లి అయిన వెంటనే తల్లి కావాలని కోరుకోరు. కొన్ని రోజులు టైమ్ తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే.. అటువంటి వాళ్లకు మాతృత్వం మీద సరైన అవగాహన ఉండకపోవచ్చు. అయితే.. ఓ మహిళ తల్లి కాకముందు ఏవైతే కలలు కంటుందో.. ఆ కలలన్నీ తల్లి అయ్యాక మారిపోతాయి. ఒక్కసారిగా జీవితమంతా ఓ చక్రంలో ఇరుక్కుపోయినట్లు భావన కలుగుతుంది.

మరి.. పిల్లలకు ముందు, పిల్లలకు తర్వాత జీవితం ఎలా ఉందో కొంతమంది తల్లులను అడిగి తెలుసుకుందాం పదండి...

1.పాలు పట్టడం 

పిల్లలకు పాలు పట్టడమంటే అది సహజమైన ప్రక్రియ అని.. అది ఎంతో సంతృప్తినిస్తుందనుకున్నా. పిల్లలకు పట్టడం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనుకున్నా. కాని... నా బేబీకి పాలు పట్టడం కోసం నేను చాలా కష్టపడుతున్నా. పిల్లాడికి పాలు పట్టేసరికి నా తల ప్రాణం తోకకు వస్తున్నది. చాలా కష్టంగా ఉంది. పిల్లలను పెంచడం అంత ఈజీ కాదు.. అని అంటున్నారు హైదరాబాద్ కు చెందిన 32 ఏళ్ల షాబన్.

2.సూపర్ మామ్ 

 సహజసిద్ధంగా వచ్చే మాతృత్వంలో ఎంతో కిక్కుంటుందనుకున్నా. నేను సాధారణ అమ్మలా కాకుండా సూపర్ మామ్ లా ఉండాలనుకున్నా. కాని.. నిజానికి ప్రస్తుతం ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా లోతుగా ఆలోచించాల్సి వస్తున్నది. నేను పిల్లలతో సతమతమవుతున్నానేమో అనే సందేహం నాలో ప్రస్తుతం కలుగుతున్నది అంటూ చెప్పుకొచ్చారు ముంబైకి చెందిన 29 ఏళ్ల కృతిక.

3.మాట వినరు 

నా పిల్లాడు పెరుగుతున్నా కొద్దీ చెప్పిన మాట వింటాడనుకున్నాను. చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు నా మాట వినేవాడు. కాని.. తర్వాత వాడు పెరుగుతున్నా కొద్దీ వాడి మాట నేను వినాల్సి వస్తున్నదని న్యూఢిల్లీకి చెందిన 34 ఏళ్ల డింపుల్ చెబుతున్నారు.

4.రాత్రి నిద్రపొవట్లేదు

పిల్లలు పుట్టిన కొన్ని రోజుల తర్వాత రాత్రి నిద్రపోతారులే అని నేను అనుకునేదాన్ని. కాని.. నా కూతురుకు ప్రస్తుతం రెండేళ్లు. ఇప్పుడిప్పుడే తను రాత్రిళ్లు నిద్రపోవడం ప్రారంభించింది అని చెప్పారు అహ్మదాబాద్ కు చెందిన 31 ఏళ్ల దీపిక.

5.అందరూ ఒకలా ఉండరు 

మా మాటలను బట్టి నా కొడుకు మాట్లాడటం నేర్చుకుంటాడులే అని అనుకున్నా.. కాని అందరు పిల్లలు అన్ని విషయాలను ఒకే విధంగా నేర్చుకోరు అని నాకు తర్వాత తెలిసింది అని పూణెకు చెందిన అస్మిత తెలిపారు.

6.అంత సులభం కాదు  

తల్లి అయ్యాక పెందలాడే లేచి.. పిల్లలను రెడీ చేసి.. వాళ్లకు బ్రేక్ ఫాస్ట్ తినిపించి... నా పని నేను చేసుకుంటాను కదా అని అనుకున్నా. కాని.. మీరు చెబితే నమ్మరు... నేను తల్లి అయ్యాక అర్థమయింది.. ఆ పనులన్నీ చేయడం అంత ఈజీ కాదని.. అని చెబుతున్నారు బెంగళూరుకు చెందిన 36 ఏండ్ల పద్మ.

7.పూర్తిగా మారిపోయింది 

పిల్లలు పుట్టాక మన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని నేను కలలు గన్నాను. కాని.. నన్ను ఇంతలా మారుస్తుందనుకోలేదు. నా మొదటి బిడ్డ పుట్టాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను ఓ పేషెంట్ లా మారాను. నా కెరీర్ కూడా ఆగిపోయింది. పిల్లలను మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు అని చెబుతున్నారు చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఆర్తి.

8.మాతృత్వం గొప్పదే కానీ 

 పిల్లలకు జన్మనిచ్చాక వాళ్లతో ప్రేమలో మునిగి తేలిపోవచ్చనుకున్నాను. తల్లిగా వాళ్లను ఎంతో ప్రేమతో చూసుకోవాలనుకున్నాను. సినిమాల్లో కూడా చూపించేది అదే కదా. కాని... డెలివరీ తర్వాత వచ్చే సమస్యలతో సతమతమవుతున్నా. మాతృత్వం గొప్పదే నేను కాదనను. కాని.. ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు కోల్ కతాకు చెందిన 32 ఏళ్ల దెబాస్మిత.

9.15 నెలలు పట్టింది 

 ఒకసారి డెలివరీ అయ్యాక.. ఓ ఆరు నెలల తర్వాత నా బాడీ తిరిగి పూర్వ స్థితికి వస్తుందిలే అని అనుకున్నా. కాని.. నాకు కనీసం 15 నెలలు పట్టింది.. అంటూ ఉద్వేగానికి లోనయ్యారు జైపూర్ కు చెందిన 33 ఏళ్ల చెత్నా.

10.ఒకేలా ఉండరు 

 పిల్లలంతా ఒకే విధంగా ఉంటారనుకున్నా. కొన్ని సంవత్సరాల వయసు వచ్చే సరికి వాళ్లు వైవిధ్యం ప్రదర్శించలేరు అని అనుకున్నా. కాని.. ఇప్పుడు నా మూడేళ్ల కొడుకును చూస్తే బాధేస్తుంది. వాడు చాలా కామ్ గా ఉంటాడు. పుట్టినప్పటినుంచీ వాడు అంతే. వాడికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కనీసం ఏడ్వడు కూడా.. అంటూ బాధపడ్డారు నాసిక్ కు చెందిన 33 ఏళ్ల పౌర్ణిమ.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon