Link copied!
Sign in / Sign up
10
Shares

మీ పిల్లలకు మీరు ఉత్తమ తల్లితండ్రులా? కాదా? అని తెలిపే 4 లక్షణాలు

చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, పిల్లల బుద్ది లేదా ఆలోచనలు వారసత్వంగా వస్తాయా లేక పెరిగిన పరిస్థితులను బట్టి అలవడుతాయా అని. దీని గురించి కొన్ని సంవత్సరాలుగా వాదనలు జరుగుతున్నాయి. అయితే, తల్లితండ్రుల వ్యక్తిత్వాన్ని బట్టి పిల్లలు ఏ విధంగా మారుతారో చెప్పవచ్చు. వారి వ్యక్తిత్వాలను ఒకసారి పరిశీలిస్తే,

అజమాయిషి

కొందరి తల్లితండ్రులలో అజమాయిషీ చేసే విధానం ఉంటుంది. వారు వారి పిల్లలకు అనేక రూల్స్ పెడతారు. ఎందుకు ఫాలో అవుతున్నామో కూడా తెలీయకుండా పిల్లలు అనుసరిస్తూ ఉంటారు. ఒకవేల వారు రూల్స్ ఫాలో అవకపోతే వారికి శిక్షలు కూడా ఉంటాయి. ఈ రకం తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా విషయాలలో స్పందించరు లేదా పట్టించుకోరు.

ఒకవేల మీరు అలాంటి కేటగిరీకి చెందిన వారైతే, మీ పిల్లల మీద మీ వ్యక్తిత్వం తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది.  పిల్లలు తరచుగా అభద్రతాభావానికి గురౌతారు. వారి నలుగురిలొ కలిసినప్పుడు సిగ్గు, బిడియం ఉండటం వంటీవి ఉంటాయి. మీ పిల్లలు ఇతర పిల్లలతో కలిసినప్పుడు దేనిలోను చొరవ చూపలేరు.

నిర్లక్ష్య ధోరణి

కొంత మంది తల్లిదండ్రులలో పిల్ల మీద ఎలాంటి బాధ్యతా, శ్రద్ధా కనిపించదు. వారికి కనీస నియమాలు కూడా లేకుండా పెంచుతుంటారు. అలాగని వారి విషయాలలో జోక్యం చేసుకుంటారని కూడా చెప్పలేము.

ఇలాంటి వ్యక్తిత్వం వల్ల పిల్లలు చాలా చెడిపోయే అవకాశం ఉంది. వీరు ఇతరులతో జరిపే సంబంధాలు కూడా చాలా ప్రమాదాలను తెచ్చి పెడతాయి. వారికి సరైన ఆత్మ గౌరవం కూడా ఉండదు.

అనుమతులిచ్చే వారు

కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి కావాలంటే అది ఇస్తారు. వీరికి రూల్స్ అనేవి ఉండవు వీరే తల్లిదండ్రులను కమాండ్ చేస్తూ ఉంటారు. వీరు చాలా ఫ్రీగా ఎక్కడికైనా తిరుగుతూ ఉంటారు.

ఇలాంటి పిల్లల వల్ల తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వారు ఏమి అడిగినా సమకూరుస్తారనే మనస్తత్వంతో పెరుగుతారు. దీంతో వారి సాంఘీక సంబంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. దీని వల్ల వారు జీవితంలో ఎక్కువ ఎత్తుకు ఎదగలేరు.

అధికారం

కొంత మంది తల్లిదండ్రుల్లో పిల్లల మీద అధికారం  చూపే గుణం ఉంటుంది. వీరు పిల్లలు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మందలిస్తారు అదే విధంగా మంచి పని చేసినప్పుడు మెచ్చుకుంటారు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయం మీద వీరు శ్రద్ధ పెడతారు మరియూ స్పందిస్తారు. పిల్లలకు వారి లక్ష్యాలను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు.

ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న తల్లిదండ్రుల వల్ల పిల్లలకు చాలా మేలు జరుగుతుంది. వారు మంచి ఏంటో, చెడు ఏంటో తెలుస్తుంది. వారికి అభద్రతాభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీరు చదువులో కానీ ఇతర విషయాలలో కానీ చాలా చురుకుగా ఉంటారు.

పైవన్నీ కూడా తల్లిదండ్రుల వ్యక్తిత్వాలను తెలియజేస్తాయి. కొంత మంది తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల వారు పిల్లలను పెంచడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలను మార్చుకోవడం అందరు తల్లిదండ్రులు తమ పిల్లలను సక్రమంగా పెంచగలరు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon