Link copied!
Sign in / Sign up
5
Shares

తల్లిబిడ్డను కాపాడటానికి తన ప్రాణాలనే పణంగా పెట్టిన డాక్టర్ : మానవత్వం చాటి చెప్పిన గొప్ప వైద్యుడు

ఆ దేవుడంటే ఎలా ఉంటాడో తెలియకపోయినా కనిపించే దేవుడిగా డాక్టర్ ను చేతులెత్తి మొక్కుతున్నాం. ప్రాణాపాయ స్థితిలో సురక్షితంగా  ప్రాణాలు కాపాడుతాడని. డబ్బులుంటునే వైద్యం చేస్తాం అని కొన్ని హాస్పిటల్స్ అంటున్న ప్రస్తుత రోజుల్లో తల్లి బిడ్డలను కాపాడటానికి ఏమీ ఆశించకుండా తన భుజాలపై మోసుకెళ్లి డాక్టర్ అంటే దేవుడు కాదు, ఆయనకంటే ఎక్కువని ఆయన మానవత్వం గురించి చాటిచెప్పుకుంటున్నారు..

మహిళకు నొప్పులు రావడంతో మోటార్ సైకిల్ పై వచ్చిన డాక్టర్

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు సువర్ణ. ఒడిశ్శాలోని మల్కాన్ గిరి జిల్లాలోగల సారిగెట్ట ఈమె గ్రామం. ఈ ఊరి నుండి టౌన్ చేరుకోవాలంటే మూడు నదులు దాటి వెళ్ళాలి. మారుమూల ఈ గ్రామంలో కనీస సదుపాయాలు, సౌకర్యాలు దొరకడం కష్టమే. గర్భంతో ఉన్న సువర్ణకు నొప్పులు మొదలయ్యాయి. పురిటినొప్పులు తీవ్రం ఇక్కడ పనిచేసే స్థానిక రిపోర్టర్ పక్క గ్రామమైన పప్పులూరులో ఉన్న డాక్టర్ ఓంకార్ హోత్తాకు సమాచారం ఇవ్వగా అతికష్టం మీద రిపోర్టర్ సాయంతో ఆ గ్రామం చేరుకున్నాడు.

పురుడు పోశాక..డాక్టర్ చేసిన గొప్ప పని

మూడు నదులు దాటుకుని పురిటినొప్పులతో ఇబ్బందిపడుతున్న సువర్ణకు పురుడుపోశాడు డాక్టర్ ఓంకార్ హోత్తా. ఐతే బిడ్డ జన్మించిన తర్వాత ఆమెకు రక్తస్రావం జరుగుతూ ఉండటమే కాకుండా బిడ్డకు అనారోగ్యం ఉండటంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పడ్డారు. ఎలాగైనాసరే తల్లిబిడ్డను కాపాడాలని మంచంపై తల్లి బిడ్డను ఉంచి, వెదురుకట్టలతో డోలీ చేసుకుని సువర్ణ కుటుంబ సభ్యులతో కలిసి 10 కి.మీ దూరంలో గల హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం చేయించాడు. తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా చేరడంతో ఇంత గొప్ప పని చేసినందుకు డాక్టర్ గొప్పదనం అందరికీ తెలుపుతూ ఆయనను అభినందించారు.

ఇది జరిగి రెండు నెలలు అవుతున్నా మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో మానవత్వం చాటిచెప్పే గొప్ప వైద్యులు ఇంకా ఉన్నారు అని చెప్పడానికే ఈ ఆర్టికల్. ‘మా దేవుడు మీరే అంటూ ఆ కుటుంబ సభ్యులు డాక్టర్ కు కృతఙ్ఞతలు తెలిపారు. ‘ 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon