Link copied!
Sign in / Sign up
2
Shares

తెల్లని దుస్తులపై మరకలు ఎలా పోగొట్టాలి..? పదే 10 నిముషాలలో మెరిసిపోయిలా చేసే ఈ చిట్కాలు మీకోసం..

తెల్లని దుస్తులు ధరించినప్పుడు వేసుకున్నవాళ్ళు ఎంత అందంగా కళకళలాడుతూ కనిపిస్తారో, ఆ డ్రస్సులను శుభ్రంగా ఉతికేవారికి చాలా కష్టంగా ఉంటుంది. తెల్లని దుస్తులపై పడ్డ మరకలను పోగొట్టడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో స్కూల్ కు వెళ్లే పిల్లలున్నప్పుడు వారి యూనిఫామ్ వైట్ డ్రెస్ ఐతే ప్రతివారం ఆ డ్రస్సులను ఉతకడానికి తల్లులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెద్దవారితో పోల్చితే చిన్నపిల్లల దుస్తులపై మరకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అందుకని ఇకపై మీ శ్రమను తగ్గించడానికి ఇక్కడ చెప్పుకునే ఈ సులభమైన చిట్కాలను ఫాలో అవ్వండి. తెల్లని దుస్తులను నిముషాలలో మెరిసిపోయేలా చేసుకోండి... 

పొటాటో 

తెల్లనిదుస్తులపై పడినటువంటి మరకలను తొలగించడానికి పొటాటో నుండి తీసిన రసం బాగా ఉపయోగపడుతుంది. పొటాటో నుండి రసం తీసి తెల్లని దుస్తులపై పడ్డ మరకలపై ఉంచి రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత మాములుగా సర్ఫ్ లో కొన్ని నిముషాల పాటు నానబెట్టుకుని ఉతికేయడం వలన తెల్ల దుస్తులపై పడ్డ మరకలు త్వరగా తొలగిపోతాయి. 

వెనిగర్ 

తెల్లని దుస్తులపై పడ్డ మరకలను తొలగించడానికి వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం వెనిగర్ తీసుకుని తెల్లని దుస్తులపై ఉన్న మరకలపై వెనిగర్ ను ఉంచి రుద్దాలి. మళ్ళీ కొద్దిసేపు నీటిలో ఈ తెల్లని దుస్తులను ఉంచి వాష్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మరకలు తొలగిపోయి దుస్తులు మిలమిల మెరిసిపోతాయి. 

నిమ్మరసం

వైట్ డ్రెస్ లపై ఉన్న మరకలను దూరం చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్న మీరు ఒక్కసారి ఇలా చేస్తే చాలు. కొద్దిగా నిమ్మరసం తీసుకుని తెల్లని దుస్తులపై పడ్డ మరకలపై కాస్త నిమ్మరసం చల్లి బాగా రుద్దటం చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత చల్లని నీటిలో దుస్తులను ఉంచి మాములుగా ఉతకడం వలన మిలమిల మెరిసిపోతాయి. 

ఇలా చేయకండి 

ఎవరు తెల్లని దుస్తులు ధరించినా సరే మరకలుపడి, చూడటానికి బాగోవేమో అనిపిస్తుంది. అలాగే ఇలా వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేలు వంటివి వాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి తెల్లని దుస్తులపై పడటం వలన త్వరగా మరకలు ఏర్పడుతాయి. కొంతమందిలో ఎక్కువగా చమటలు వస్తుండటం వలన చంకల నుండి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కూడా. అందుకని ఇలా జరగకుండా ఉండటానికి ఆర్మ్ ప్యాడ్లు వాడటం బెటర్. 

బేకింగ్ సోడా 

తెల్లని దుస్తులపై పడినటువంటి మరకలను తొలగించడానికి మరో బెస్ట్ రెమెడీ బేకింగ్ సోడా. తెల్లని దుస్తులను నీటిలో నానబెట్టేటప్పుడు అందులో కాస్త బేకింగ్ సోడా వేసుకుని శుభ్రం చేసుకోవడం వలన వైట్ డ్రెస్ లపై పడినటువంటి మరకలను శుభ్రంగా దూరం చేసుకోవచ్చు. 

తెల్లని దుస్తులను శుభ్రం చేయడం అనేది ప్రతి ఒక్కరికీ చాలా కష్టమైన పనే. అయితే ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ గృహ చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ చిట్కాలు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయగలరు. అలాగే వైట్ డ్రెస్ లను వాషింగ్ మెషిన్ లో వేయకుండా సాధారణంగా చేతులతోనే శుభ్రం చేసుకోవడం ఉత్తమం.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon