Link copied!
Sign in / Sign up
15
Shares

తెల్లజుట్టును నల్లగా మార్చే అద్భుత ఇంటి చిట్కాలు : ఒక్కసారి ఇలా చేస్తే చాలు

యవ్వనదిశ నుండి వృద్ధాప్యంలోకి, బాగా వయస్సు పెరుగుతున్నప్పుడు గానీ తెల్లజుట్టు వచ్చేది కాదు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు మాత్రం చిన్న వయస్సులోనే చాలామంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. మనం తీసుకునేటువంటి ఆహారం, కాలుష్యం, దుమ్ము ధూళి కారణంగా, కుటుంబంలో ఎవరైనా ఇలా తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నా సరే ప్రస్తుతం చాలా తొందరగా వైట్ హెయిర్ వస్తోంది. అలాగే ఒకప్పుడు కుంకుడుకాయలను తలంటు కోవడానికి వాడేవారు, కానీ ఇప్పుడు మాత్రం కెమికల్స్ ఉన్నటువంటి షాంపూలు ఉపయోగించడం కూడా తెల్లజుట్టుకు కారణమవుతోంది. మరి తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ చూడండి..

తులసి ఆకులతో

మన ఆయుర్వేద నిపుణులు చెప్పిన ప్రకారం కొన్ని తులసి ఆకులను ఒక గిన్నెలో నీటిని వేసి అందులో తులసి ఆకులను ఉంచి వేడి చేసుకోవాలి. బాగా మరిగాక కిందకు దించి గోరువెచ్చగా అయ్యేంతలా చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని జుట్టుకు రాసుకుని ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

ఉసిరి

రెండు లేదా మూడు ఉసిరి కాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో బాగా ఎండబెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో కొబ్బరినూనె మరియు ఎండబెట్టిన ఉసిరి ముక్కలను వేసి కాస్త వేడిచేయాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నటువంటి ఈ నూనెను తలకు రాసుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు

తలజుట్టు తెల్లగా మారకుండా ఉండాలంటే కరివేపాకును మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకని మీరు తినే ఆహారంలో కరివేపాకు వస్తే అస్సలు పక్కనపెట్టండి. అలాగే కొంచెం కరివేపాకును తీసుకుని మజ్జిగ లేదా పెరుగులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే కాస్త గోరువెచ్చని నీటిని కలుపుకుని తలకు రాసుకుని బాగా ఆరిన తర్వాత తలంటుస్నానం చేస్తే తెల్లజుట్టుకు గుడ్ బై చెప్పేయవచ్చు.

మెంతులు

తెల్లజుట్టును నల్లగా మార్చే గృహ చిట్కాలలో మెంతులు ఒకటి. ఒక చిన్న కప్పులో నీటిని తీసుకుని అందులో గుప్పెడు మెంతులను రాత్రి నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం ఈ నీటిని జుట్టు కుదుళ్లకు రాసుకుని కొన్ని నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

ప్రస్తుతం తెల్లజుట్టు అనేది ప్రతి ఒక్కరినీ కాస్త ఇబ్బంది పెడుతున్న సమస్యే కాబట్టి, ఈ గృహ చిట్కాలను ప్రయత్నించి చూడండి. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon