Link copied!
Sign in / Sign up
4
Shares

తెలివైన మహిళలు అయితే ప్రగ్నన్సీ సమయంలో ఈ ఆహారాన్ని అస్సలు తినరు?

అమ్మ అవ్వడం స్త్రీలకు దక్కిన అదృష్టం మరియు గౌరవం. అటువంటిది మీరు గర్భంతో ఉన్నప్పుడు మీతోపాటు మరో ప్రాణం మీ కడుపులో ఉందని ఏమాత్రం మర్చిపోకూడదు. మీరు తీసుకునే ఆహారం మీకే కాకుండా మీ బిడ్డ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది కాబట్టి తెలివైన  మహిళలు ఐతే ఖచ్చితంగా ప్రగ్నన్సీ సమయంలో ఈ ఆహారాలకు దూరంగా ఉంటారు. అవేంటో మీరు తెలుసుకుని అందరికీ SHARE చేయండి.

జున్ను పదార్థాలు

సాధారణంగా జున్ను మంచి పదార్థమే కానీ ప్రగ్నన్సీ సమయంలో కొన్ని రకాల సాఫ్ట్ జున్ను పదార్థాలకు మాత్రం దూరంగా ఉండాలి. వీటిలో లిస్టిరియా అనే బాక్టీరియా ఉండటం వలన గర్భంపై ప్రభావం చూపెడుతుంది. కావాలంటే డాక్టర్ సూచించిన ప్రకారం ఏ రకం జున్ను మంచిదో అది తీసుకోవడం ఉత్తమం.

మాంసం

మాంసం తినకూడదు అని మేము చెప్పట్లేదు కానీ గర్భంతో ఉన్నప్పుడు కుళ్లిపోయిన, వాసన వస్తున్నటువంటి, దుమ్ము, ధూళి చేరిన, సరిగ్గా ఉడకని మాంసం తీసుకోవడం వలన ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సో, మీరు మాంసం తీసుకునేటప్ప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

బొప్పాయి

గర్భం దాల్చిన తర్వాత ప్రగ్నన్సీతో ఉన్న మహిళకు ప్రతి ఒక్కరూ చెప్పే విషయం బొప్పాయికి దూరంగా ఉండమని. ఎందుకంటే ఇందులో లేటెక్స్ అనే పదార్థం ఉండటం వలన గర్భంలో సంకోచాలు ఏర్పడేలా చేసి గర్భాన్ని దూరం చేస్తుంది. అందుకే బొప్పాయిని గానీ వీటితో చేసిన పదార్థాలను కానీ అస్సలు తీసుకోకూడదు.

మెర్క్యూరీ ఫిష్

కొన్ని రకాల చేపలలో మెర్క్యూరీ అధికంగా ఉంటుంది. వీటి జోలికి ప్రగ్నన్సీ సమయంలో అస్సలు వెళ్ళకూడదు.  గోల్డ్ ఫిష్, టూనా, షార్క్ లలో ఈ మెర్క్యూరీ శాతం అధికంగా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఏవి మంచివో చూసుకుని తినాలి.

సరిగ్గా ఉడకని మొలకలు

అవును వీటిని అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకంటే సరిగ్గా ఉడకని ముల్లంగి, మొలకెత్తిన విత్తనాలు, పెసర గింజలలో ఎక్కువ శాతం బాక్టీరియా చేరి ఉండటం వలన గర్భంతో ఉన్న మహిళకు మరియు ఆమె ఆరోగ్యంపైనా ఎక్కువ ప్రభావం  చూపుతుంది. అలాగే వేరే పదార్థాలతో కలిపి గుడ్లు తీసుకోవడం, కాఫీ, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మంచిది.

దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ చేరేలా SHARE చేయగలరు. 

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon