Link copied!
Sign in / Sign up
0
Shares

టెక్నాలజీ మీ పిల్లలకు భవిష్యత్తుని బాగు చేస్తుందా? పాడు చేస్తుందా?

మీ పిల్లలు ఎప్పుడూ ఫోన్లో గేమ్స ఆడుకుంటున్నారా? ఫోన్ మాత్రమే కాదు పెరుగుతున్న టెక్నాలజీ మీ పిల్లలకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని అయోమయంలో ఉన్నారా? ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది రోజు వారి జీవితంలో ఒక భాగం అయిపోయింది. నిజానికి, టెక్నాలజీని వాడకుండా ఒక్క రోజు కూడా గడపలేము అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా చేతిలో ట్యాబ్, ఫోన్లు పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వలన కలిగే మంచి చెడు రెండు తెలుసుకుందాము.

టెక్నాలజీ పూర్తిగా చెడ్డది కాదు… ఎందుకంటే…

పిల్లల పరంగా టెక్నాలజీ అంటే గేమ్స్ ఆడే పరికరాలు కాబట్టి అవి పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. పిల్లలు ఒక గేమ్ లో నిమగ్నమై ఆడుతున్నారంటే వాళ్ళు చాలా కష్టమైన మరియు అవసరమైన నైపుణ్యం సంపాదించుకుంటున్నారు. అదేమిటంటే, సమయస్ఫూర్తి. నిజమండి, ఒక అధ్యయనం ప్రకారం వీడియో గేమ్స్ ఆడే పిల్లలలో సమయస్ఫూర్తి అధికంగా ఉంటుందని తెలిసింది. వీడియో గేమ్స్ ఆడే పిల్లలు దేనినైనా క్షున్నంగా పరిశీలించగలరు మరియు ఒకేసారి రెండు పనులు చేయగలరు. అంతే కాకుండా వీరికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది. వీడియో గేమ్స్ ఆడటం ఇందువలన మంచిది.

చెడ్డదిగా ఎప్పుడు మారుతుంది

అందరికి తెలిసిన విషయమే ఇది. జీవితంలో ఏది ఎక్కువగా చేసినా మంచిది కాదు. అందుకే పెద్దలు అన్నారు అతి సర్వత్రా వర్జయేత్ అని. ఈ మాట టెక్నాలజీకి కూడా వర్తిస్తుంది. అవసరానికి టెక్నాలజీ వాడటం మంచిది కానీ ప్రతి దానికి టెక్నాలజీ మీద ఆధారపడటం అంత మంచిది కాదు. పిల్లలు ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలతో సమయం గడపడం వలన వారికి బాహ్య ప్రపంచంతో, తల్లిదండ్రులతో మరియు స్నేహితులతో సంబంధాలు తగ్గిపోతాయి. Archives of Pediatrics And Adolescent Medicine నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం ధృవీకృతమైనది. అంతే కాకుండా పిల్లలు బరువు పెరగడం కూడా జరగవచ్చు. ఎక్కువ సేపు టీవీ లేదా ట్యాబ్ వాడటం వలన నిద్రకూడా సరిగా రాకపోవచ్చు. బయట వెల్లి శారీరిక గేమ్స్ ఆడకపోవడం వలన పిల్లల్ల్లో ఉత్సాహం కూడా తగ్గుతుంది.

దీనిని బట్టి ఏమి అర్థమైంది. టెక్నాలజీ మంచిదా? చెడ్డదా? సమాధానం ఒక్కటే. అతి సర్వత్రా వర్జయేత్. ఆవసరం మేరకు మాత్రమే టెక్నాలజీని ఉపయోగించాలి అని చెప్పి మీ పిల్లలను మంచి మార్గంలో నడిపించండి. రోజుకు కొద్ది సేపు మాత్రమే వీడియో గేమ్స్ వంటివి ఆడటానికి అనుమతి ఇవ్వండి. అంతే కాకుండా తప్పకుండా స్నేహితులతో వెళ్ళి గ్రౌండ్లో ఆడుకోమని చెప్పండి. చదువుతో పాటు వారి బాల్యంలో అన్నింటినీ ఆస్వాదించేలా చేయండి.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon