Link copied!
Sign in / Sign up
0
Shares

చిన్న పిల్లాడికి మూత్రం కలిపిన జ్యూస్ తాగించిన టీచర్ : అసలు ఏం జరిగిందంటే..

చిన్న పిల్లలు అన్నాక తెలిసో తెలియకో ఏదో తప్పు చేస్తూ ఉంటారు. క్లాస్ లో తోటి విద్యార్థులతో గొడవపడటం, అల్లరి చేయడం వంటివి చేస్తూ ఉంటారు. తప్పు చేసినందుకు గుజ్జీలు తీయించడం, బెత్తంతో కొట్టడం లేదా గోడ కుర్చీ వేయమని చెప్పే టీచర్లను చూసే ఉంటారు. కానీ ఈయన మాత్రం ఎంత దారుణంగా ప్రవర్తించారో మీరే చూడండి.

మూత్రం కలిపిన జ్యూస్

ఇంటి నుండి స్కూల్ కు వెళ్లిన విద్యార్ధి ఇంటర్వెల్ టైంలో మరొక విద్యార్థినితో మాట్లాడటం చేశాడు. అలా మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ తుంటరి స్టూడెంట్ కు కోపం రావడంతో ఆ అమ్మాయి తెచ్చుకున్న జ్యూస్ బాటిల్ లో మూత్రం నింపాడు. క్షణికావేశంలో ఆ తప్పు చేసినా, అది మంచిది కాదనుకుని నేను ఇందులో మూత్రం కలిపాను ప్లీజ్ తాగవద్దు అని చెప్పాడు. అయితే తన జ్యూస్ బాటిల్ లో పాస్ పోసినందుకుగానూ ఆ అమ్మాయి వెళ్లి పీటీ సార్ కుమార్ కు కంప్లైంట్ చేసింది.

ప్లీజ్ సార్ అని వేడుకున్నా వదిలివేయలేదు

ఆ అమ్మాయి వెళ్లి పీటీ సార్ కు కంప్లైంట్ చేయగానే క్లాస్ గదిలోకి వచ్చిన పీటీ సార్ అందరిముందు ఆ అబ్బాయిని తన వద్దకు పిలిచాడు. ఆ బాటిల్ తీసుకుని తాగమని చెప్పాడు. సార్ ప్లీజ్ ఐ యామ్ సారీ అని చెప్పినా కూడా వదిలిపెట్టకుండా బలవంతంగా మూత్రం కలిపిన జ్యూస్ తాగించాడు. దీంతో అవమానంగా ఫీలైన ఆ అబ్బాయి ఇంటికివెళ్ళి జరిగిన విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాడు. స్కూల్ కు వచ్చి ప్రిన్సిపాల్ ను అడగగా, మీ అబ్బాయి చేసింది తప్పే కదా, అందుకే పీటీ సార్ ఇలా చేశారు అని ఆయనవైపే సమర్థించారు. కాగా, దీనిపై పోలీసులకు ఆ తల్లితండ్రులు ఫిర్యాదు చేయగా. పీటీ సార్ ను అరెస్ట్ చేశారు.

చిన్న పిల్లలు తెలిసో తెలియకో చేసిన తప్పులను వాళ్లకు అర్థమయ్యేలా నువ్వు చేసింది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పాలి గానీ, ఇలాంటి పనులు చేసి మీకున్న గౌరవాన్ని మీరే చేజేతులా వదిలేసుకోకండని సోషల్ మీడియాలో దీనిపై COMMENT చేస్తున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon