Link copied!
Sign in / Sign up
0
Shares

తన ‘బంగారు రక్తంతో’ 20 లక్షల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన ఓ పెద్దాయన..

మన శరీరానికి చిన్న గుండు సూది గుచ్చుకుని రెండు చుక్కల రక్తం వస్తేనే విలవిలలాడిపోతాం, అలాగే ఎవరికైనా రక్తదానం చేయాలంటే ఆమ్మో రక్తం ఇవ్వాలా అని ఒకటికి  పది సార్లు ఆలోచిస్తాం. కానీ ఈయన మాత్రం ఇప్పటివరకు కొన్ని వందలసార్లు రక్తదానం చేసి దాదాపు 20 లక్షల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడటమే కాకుండా కొన్ని వేల తల్లులకు సంతోషాన్ని మిగిల్చాడు. ఈ గొప్ప వ్యక్తి గురించి ప్రతి ఒక్కరికీ తెలిసేలా SHARE చేయండి.

గత 60 ఏళ్లుగా రక్తదానం

1936 లో ఆస్ట్రేలియాలో లో జన్మించిన ఈయన జేమ్స్ హారిసన్. 1951 లో (14 ఏళ్ళ వయస్సులో) చెస్ట్ పెయిన్ తో బాధపడుతున్న ఈయన హాస్పిటల్ కు చెకప్ చేయించుకోవడానికి లంగ్స్ సమస్య కూడా ఉండడంతో ఆయన శరీరం నుండి ఒక ఊపిరితిత్తిని తీసివేయడం జరిగింది. కాగా, ఈ సమయంలో ఆయన శరీరం నుండి దాదాపు 13 యూనిట్ల రక్తం బయటకు పోవడంతో, 13 మంది నుండి రక్తం సేకరించి జేమ్స్ శరీరంలోకి ఎక్కించారు. ఆస్ట్రేలియాలో ఇదే సమయంలో ఏడాదికి వేల చిన్నారులు తల్లి గర్భంలో అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందక చనిపోతూ ఉండేవారు.

బంగారు రక్తంతో ప్రాణాలు కాపాడాడు

తల్లి గర్భంలో బిడ్డ అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడానికి కారణం రీసస్ అనే వ్యాధి (RHESUS DISEASES) అని వైద్యులు గుర్తించారు. తల్లి ప్రాణాలు మాత్రమే కాకుండా గర్భంలో పెరుగుతున్న శిశువు అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందడానికి ఈయన రక్తం ద్వారా ఆ వ్యాధిని నివారించవచ్చని, జేమ్స్ గారి నుండి రక్తం సేకరించి పరీక్షలు చేశారు. ఈయన రక్తం యాంటీ డీ ఇంజక్షన్ గర్భిణీ మహిళలకు ఇవ్వడం మొదలుపెట్టారు.

పిల్లల పాలిట దేవుడు

ప్రతి సంవత్సరం దాదాపు 17 శాతం మంది రీసస్ వ్యాధి కారణంగా బాధపడుతుండటంతో ఆరోగ్య నిపుణులతో కలిసి గర్భిణీ మహిళలను, శిశువులను కాపాడటానికి ఆయన రక్తం దానం చేసేవారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ప్రపంచ మీడియా ఛానల్స్ ఈయన చేసిన గొప్ప పనికి ఎంతో గర్వంగా తమ ఛానల్స్ లలో అందరికీ తెలిసేలా చేశారు. 80 ఏళ్ళ వయస్సులో జేమ్స్ హారిసన్ గారు తన ప్రాణాలు ఉన్నంత రక్తదానం చేస్తానని చెప్పడం గర్వకారణం. అందుకే ఈయనను ‘ది మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్’ అని పిలుస్తున్నారు.

ఈ గొప్ప వ్యక్తి గురించి అందరికీ తెలిసేలా SHARE చేసి, మీ COMMENT తెలుపగలరు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon