Link copied!
Sign in / Sign up
30
Shares

తమ భార్యల్లో రొమాంటిక్ విషయాల గురించి మాతో పంచుకున్న 6గురు భర్తలు


మీ భర్తకు మీలో ఏమంటే ఇష్టం? మంచితనం, అందం, వంట ఇవన్నీ కాకుండా ఇంకా ఏమైనావున్నాయా? అసలు ఇవన్నీ కాదు, మీలో ఎలాంటి విషయాలు మీ ఆయనకు రొమాంటిక్ గా అనిపిస్తాయి. మగవాళ్ళకు ఏ విషయాలు రొమాంటిక్ గా  అనిపిస్తాయో, 6 మంది మాతో పంచుకున్నారు…అవి మీకోసం..

1. కౌగిలంతలు

“ మా ఆవిడ నన్ను కౌగిలించుకుంటే నాకు చాలా ఇష్టం. అది గట్టిగా అయితే ఇంకా ఇష్టం. మా ఆవిడ అలా చేసినప్పుడు, తన మీద ప్రేమ పెరిగిపోతుంది. తనను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలనిపిస్తుంది”.

2. తన చేతి వంట

“ తను రోజు చేసే వంటలు, బయట తినేవి బోర్ కొట్టినప్పుడు. తను నాకోసం ఏదైనా స్పెషల్ గా చేస్తే, నేను రొమాంటిక్ అయిపోతా…. తను ఏది చెప్తే అది, తాను ఏది అడిగితే అది… చేసేస్తా.. ఇచ్చేస్తా..”

3. తన వడిలో నిద్రపోవడం

“ బాగా అలసిపోయినప్పుడు, తన వడిలో పనుకుని, తను అప్పుడు తన చేతివేళ్ళను, నా జుట్టులోకి పోనిచ్చి, అలా నిమురుతూ ఉంటె…. అదే అనుభూతి మాటల్లో చెప్పలేనిది”

4. తనతో కలిసి నడవడం

“ తన చేతిలో చేయి వేసి, అన్ని విషయాలు మాట్లాడుకుంటూ , అలా ఎంత దూరమైనా నడవాలనిపిస్తుంది. తనతో నడిచే ఆ ప్రతి క్షణం, తనతో మళ్ళి ప్రేమలో పడాలనిపిస్తుంది…. “

5. సర్’ప్రైజస్

“ నేను ఎప్పుడో చాక్లేట్ కేక్ అంటే ఇష్టమని చెప్పానని, అది ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి, నేర్చుకుని, నా బర్త్డే రోజు సర్ ప్రైజ్ ఇచ్చింది. తాను ఇచ్చే ఇలాంటి సర్ ప్రైజస్ అంటే నాకు చాలా ఇష్టం… “

6. టెక్స్ట్ చేయడం

“ రోజు ఆఫీస్ లో, పని నుండి తప్పించుకుని కాస్త ఊపిరి పీల్చుకునే క్షణాలు, తను టెక్స్ట్ చేసినప్పుడే. నేను ఎక్కడవున్నా, ఎంత పనిలో ఉన్న తన మెసేజ్ కోసం ఎదురుచూస్తుంటాను”

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon