Link copied!
Sign in / Sign up
4
Shares

తల్లులు పిల్లలను కనడం కోసం ఏమైనా చేస్తారు అని రుజువుచేసే 10 ఫోటోలు : తల్లి కడుపుకోత తెలుస్తుంది

గర్భం దాల్చిన తర్వాత బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నానని ఎంత సంతోషం ఉంటుందో, అంతే బాధగానూ ఉంటుంది. ఎందుకంటే నాకు నార్మల్ డెలివరీ జరుగుతుందా? సిజేరియన్ ఆపరేషన్ జరుగుతుందా? అని ఎప్పుడు చింతగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో నార్మల్ డెలివరీ కష్టం అని సిజేరియన్ ఆపరేషన్ ఉత్తమమని మహిళల ఆలోచనలను కొందరు వైద్యులు మార్చేశారు. అయితే ఒక బిడ్డకు జన్మను ఇవ్వడానికి తల్లి ఎంత కడుపుకోతను అనుభవిస్తుందో ఈ ఫొటోలు చూస్తే చాలు.

సిజేరియన్ ఎందుకు చేస్తారు?

బిడ్డకు జన్మను ఇచ్చే పెల్విక్ ఎముక నిర్మాణంలో తేడా జరిగినప్పుడు సహజమైన ప్రసవం కష్టం అవుతుంది. అటువంటి సమయంలో సిజేరియన్ ఆపరేషన్ బెస్ట్ అని చెబుతారు వైద్యులు. అలాగే గర్భాశయ ముఖ ద్వారాన్ని ప్రసవం సమయంలో మాయ అడ్డుపడి డెలివరీ జరగకుండా రక్తస్రావం అధికంగా ఉంటుంది. అందుకని సి-సెక్షన్ ఆపరేషన్ కు సిద్ధమైపోతారు.

నార్మల్ డెలివరీ అంటే భయంతో

ప్రస్తుతం చాలావరకు సిజేరియన్ ఆపరేషన్లు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీ సమయంలో నొప్పులను నువ్వు భరించడం చాలా కష్టం అని ఎవరైనా చెప్పినప్పుడు భయపడి, సిజేరియన్ ఐతే నీకు తెలియకుండానే రెండు నిముషాలలో జరిగిపోతుందని చెప్పడం వలన నార్మల్ డెలివరీకి కొందరు మహిళలు భయపడుతున్నారు.

బిడ్డకు ప్రమాదం అని తెలిసినప్పుడు

బిడ్డ అడ్డం తిరిగాడని, అధిక బరువుతో బిడ్డ ఉన్నాడని దీని కారణంగా నార్మల్ డెలివరీ కష్టమని చెప్పినప్పుడు, అలాగే ఇంతకుముందు గర్భసంచికి ఏదైనా ఆపరేషన్స్ జరిగి ఉంటే సిజేరియన్ ఆపరేషన్స్ కు సిద్ధమవుతుంటారు. వాస్తవానికి బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించే ఎక్కువ మహిళలు సిజేరియన్ వైపు వెళ్తున్నారు.

అయితే ఇక్కడ ఉన్న ఈ ఫోటోలు చూస్తే బిడ్డకు జన్మను ఇవ్వడానికి తల్లి ఎంత కడుపుకోతను అనుభవిస్తుందో తెలుస్తుంది. 

1.సిజేరియన్ తర్వాత బిడ్డను చూడగానే తల్లి ఆనందం 

2.వెల్కమ్ బేబీ..తల్లి గర్భం నుండి సిజేరియన్ ద్వారా బయటకు వస్తున్న బిడ్డ 

3.బిడ్డ చేయిని తాకుతూ ఆనందాన్ని పొందుతున్న తల్లి 

4.బిడ్డను చూడాలనే తపన తల్లి కళ్ళలో 

5.తల్లి ఒడిలో చేరుకున్న చిన్నారి 

6.బిడ్డను చూసి ఆనందంతో తల్లి కన్నీళ్లు..నీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు 

7.బిడ్డను తల్లి కడుపునుండి బయటకు తీయడానికి ఇబ్బందిపడుతున్న వైద్యులు 

 

8.తల్లి కడుపులో నుండి ఏడుస్తూ బయటకు వస్తున్న శిశువు 

9.స్వారీ అమ్మా నిన్ను చాలా కష్టపెట్టాను 

10.ఇకపై నువ్వే నా ప్రపంచం 

మహిళ (తల్లి) గొప్పదనాన్ని తెలియజేసే ఈ ఫోటోలను అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon