Link copied!
Sign in / Sign up
62
Shares

తల్లి పాలు పెరగడానికి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి తప్పక తీసుకోవాల్సిన 5 ఆహార పదార్థాలు

 

గర్భంతో ఉన్నప్పుడు కంటే ప్రసవం తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అని మదన పడుతూ ఉంటారు.  అలాగే బిడ్డకు పాలు సరిపోవడం లేదని చాలామంది తల్లులు తమలో తామే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. బిడ్డకు తల్లి నుండి 6 నెలలు పాలు ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇక్కడ చెప్పుకునే ఆహార పదార్థాలు  తినడం వలన తల్లికి పాలు పెరుగుతాయి మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతాయి.

మెంతి నీరు

తల్లికి పాల ఉత్పత్తిని పెంచి బిడ్డను ఆరోగ్యంగా ఉంచడంలో మెంతి నీరు బాగా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో కొన్ని మెంతులు తీసుకుని అందులో నీటిని పోసి నానబెట్టాలి. ఉదయం మెంతులను నీటి నుండి వేరు చేసి ఆ నీటిని వడగట్టుకుని సేవించడం వలన తల్లిపాలు పెరగడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లి

వెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ప్రసవం తర్వాత బిడ్డకు పాలు తగినంత లేవు అని ఇబ్బందిపడే మహిళలకు వెల్లుల్లి ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. వెల్లుల్లిని ఆహారంలో లేదా డైరెక్ట్ గా రోజుకి రెండు మూడు తీసుకుంటే మంచిది.

బాదం గింజెలు

ప్రతి రోజూ ఒక ఐదు బాదంలను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందుగా వాటిని తీసుకోవడం వలన తల్లికి పాలు పెరిగేలా సహాయపడటంలో తోడ్పడుతుంది. అలాగే ప్రసవం తర్వాత బలహీనంగా ఉంటారు కాబట్టి బలంగా ఉండేందుకు మంచిగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

సోంపు

చాలామంది వీటిని కేవలం ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణం కావడానికే ఉపయోగపడతాయని అనుకుంటారు గానీ తల్లికి పాల ఉత్పత్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. ప్రతి రోజూ వీటిని ఒక గుప్పెడు తీసుకోవడం వలన పాలు బాగా పట్టేలా చేయగలదు.

ఓట్స్

ఓట్స్ ను తల్లి పాలు పెరగడానికి సహాయపడే బెస్ట్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. వీటిలో అధికంగా ఐరన్ ఉండటం  వలన తల్లితో పాటు బిడ్డకు మంచిది. అలాగే రక్తహీనత లేకుండా చేయగలదు. పాలతో కలిపి బ్రేక్ ఫాస్ట్ కు ముందుగా తీసుకుంటే మంచిది.

బిడ్డకు తల్లి పాలు బాగా అవసరం, ఆరోగ్యకరం కాబట్టి అందరికీ తెలిసేలా SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon