Link copied!
Sign in / Sign up
5
Shares

తలనొప్పి అని ఈ మహిళ హాస్పిటల్ కు వెళితే, ఆమె చెవిని చూసి షాక్ అయిన డాక్టర్స్ : అసలేం జరిగిందంటే 😰😰

కొన్ని లక్షల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అందరికీ  ఆ వీడియోల వలన ఉపయోగం ఉంటుందో లేదో గానీ ఇక్కడ చూసే ఈ వీడియో మాత్రం మీకు ఉపయోగపడుతుంది. అయితే భయపడని వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి,  ఎందుకంటే ఇది మిమ్మల్ని కాస్త బాధపెట్టవచ్చు. అసలేం జరిగిందో మీరే చూడండి..

తలనొప్పిగా ఉందని హాస్పిటల్ కు వెళితే..

బెంగళూర్ లోని హెబ్బాల్ లో నివాసముండే మహిళ రెండు రోజులుగా తలనొప్పితో బాధపడుతూ, సహజమైన నొప్పే అని అనుకుంది. అయితే రోజురోజుకీ తలనొప్పి ఎక్కువ కావడంతో వెంటనే దగ్గరలోని హాస్పిటల్ వెళ్లి డాక్టర్ ను కలిసింది. డాక్టర్ కూడా సాధారణంగా వచ్చే తలనొప్పే అని భావించినా స్కాన్ చేసిన తర్వాత ఆమె చెవిలో ఉన్న ఓ భయంకరమైన జీవిని చూసి షాక్ అయ్యారు.

చెవిలో ఏముందంటే..

ఆ మహిళ తలనొప్పి ఎక్కువగా ఉందని బాధపడుతుండటంతో స్కాన్ చేయగా చెవిలో ఇరుక్కున్న స్పైడర్ (సాలీడు) ను చూసి షాక్ అయ్యారు. దీని కారణంగా ఆమె చెవిలో, తలలో నొప్పని గ్రహించారు. చెవిలోకి వెళ్లిన సాలీడు వంటి వాటిని బయటకు తీసే పరికరంతో ఇదిగో ఈ వీడియోలో చూపిన విధంగా బయటకు తీశారు. సాలీడును బయటకు తీశాక ఆమె ప్రశాంతంగా ఉందని చెప్పింది.

Video Credits : SWNS TV
ఈ జాగ్రత్తలు తీసుకోండి..

- రాత్రి నిద్రపోయే సమయాలలో మీరు పడుకునే బెడ్ పై లేదా దుప్పట్లలో ఇలాంటి క్రిమికీటకాలు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసి పడుకోవాలి.

- ఈ విషయాలలో నొప్పిని తట్టుకోవడం పిల్లలకైనా, పెద్దలకైనా ఒకటే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

- రాత్రి పడుకునేముందు దూదిని కాస్త తీసుకుని గుండ్రంగా చేసుకుని చెవులలో పెట్టుకుని నిద్రించడం మంచిదే.

- లైటు వెలుతురు లేకుండా పడుకునేముందు అన్నిటినీ ఆఫ్ చేసి నిద్రించాలి. లైటు వెలుతురుకి చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి. ఇవి చెవులలో దూరటం వలన అవి లోపల చేసే గోలకు ఆ నొప్పిని భరించడం చాలా కష్టం.

ఇవే కాకుండా మీకు తెలిసిన విషయాలను, జాగ్రత్తలను కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయవచ్చు. మీరు చెప్పే జాగ్రత్తలు అందరికీ ఉపయోగపడవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon