Link copied!
Sign in / Sign up
3
Shares

ఈమె తన తలదిండు కింద ‘వెల్లుల్లి’ని పెట్టుకుని నిద్రించింది : ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మీరు విన్నారో లేదో గానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని మనవాళ్ళు అంటుంటారు. మీకు తెలుసా వెల్లుల్లిని దివ్య ఔషధంగా పరిగణిస్తారు. వెల్లుల్లిని మన శరీరంలో వచ్చే చాలా జబ్బులను నివారించడానికి ఆయుర్వేదంగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి తినడం వలన బరువు తగ్గుతారని, వెల్లుల్లి వలన కాలేయ  సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చని నిరూపితమైంది కూడా. అలాగే ఇక్కడ ఆమె తన తలదిండు కింద వెల్లుల్లిని పెట్టుకోవడం వలన ఏం జరిగిందే చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  అదేంటో మీరే చూడండి.

వెల్లుల్లిని తలదిండు కింద పెట్టుకుంటే..

◾ వెల్లుల్లిని మనం ప్రతి రోజూ చేసుకునే ఏదో ఒక ఆహారంలో ఉపయోగిస్తూనే ఉంటాం. అమ్మనాన్న వెల్లుల్లిని తప్పకుండా తినాలి, కింద పడివేయకూడదు అని కూడా అంటుంటారు కదా. ఎందుకు అలా చెబుతారో ఇది చదివితే మీకే అర్థమవుతుంది. 

◾ వెల్లుల్లిని యాంటీ ఆక్సిడెంట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన శరీర రక్తంలో అధికంగా ఉండే చక్కర స్థాయిలు మరియు కొవ్వును తగ్గించివేసి, రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.

◾ జలుబు,దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఒకటి లేదా రెండు వెల్లుల్లిలను తినడం వలన యాంటీ బయాటిక్ గా పనిచేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

◾ జుట్టు రాలడం సమస్యతో బాధపడేవారు పచ్చి వెల్లుల్లిని తలపై అప్లై చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అలాగే వెల్లుల్లిని జుట్టు రాలకుండా సహజ నూనెగా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. కొన్ని వెల్లుల్లిలను తీసుకుని ఆలివ్ ఆయిల్ లో వేసుకోవాలి. రెండు వారాలు నానబెట్టుకుని ఆ తర్వాత జుట్టుకు రాసుకోవడం వలన జుట్టు రాలే సమస్య ఉండదట.

◾ వెల్లుల్లిని చాలామంది రాత్రి పడుకునేముందు తలదిండు కింద పెట్టుకుని పడుకోవడం వలన అంతా మంచే జరుగుతుందని, నెగటివ్ ఎనర్జీ ఉండదని చాలామంది చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వలన దుష్టశక్తులు దరిచేరవని, పిల్లలకు భయాలు ఉండవని అంటారు. ఇంకొంతమంది తమ జేబులో పెట్టుకోవడం చేస్తుంటారు. ఇలా చేస్తే అదృష్టమని వారు భావిస్తున్నారు.

◾ వెల్లుల్లి తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు బాగా జరుగుతుంది. నోటిపుండ్ల సమస్యతో బాధపడేవారు, నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు వెల్లుల్లి తీసుకోవడం వలన వాటికి గుడ్ బై చెప్పవచ్చు.

◾ శృంగారంలో వీక్ గా ఉన్నవారు వెల్లుల్లి తీసుకోవడం వలన శృంగారంలో ఆసక్తి పెరుగుతుందని, అలాగే మగవారిలో వీర్యవృద్ధి జరుగుతుందని చెబుతున్నారు.

వెల్లుల్లిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తున్నారు మన ఆయుర్వేద నిపుణులు. మీలో వెల్లుల్లి ప్రయోజనాలు తెలిసి వారందరూ అందరికీ తెలిసేలా షేర్ చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon